Ola Uber Fare: ఓలా, ఉబెర్‌ టాక్సీ ఛార్జీలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు..?

Ola Uber Fare: మన ఎక్కడికైనా వెళ్లాలంటే పలు మొబైల్‌ యాప్‌ల ద్వారా బైకు, కారు, ఆటో, ఇతర వాహనాలను బుక్‌ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ (Mobile App) ద్వారా సులభంగా..

Ola Uber Fare: ఓలా, ఉబెర్‌ టాక్సీ ఛార్జీలను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు..?
Follow us
Subhash Goud

|

Updated on: Apr 18, 2022 | 6:15 PM

Ola Uber Fare: మన ఎక్కడికైనా వెళ్లాలంటే పలు మొబైల్‌ యాప్‌ల ద్వారా బైకు, కారు, ఆటో, ఇతర వాహనాలను బుక్‌ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ (Mobile App) ద్వారా సులభంగా వాహనాలను బుక్‌ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఓలా, ఉబర్ లాంటి కంపెనీలు కూడా అదే పని చేస్తున్నాయి. రేడియో టాక్సీ (Radio Taxi) పేరుతో నడిచే వాహనాలు కూడా ఈ కోవలోకి వస్తాయి. ఈ టాక్సీని బుక్ చేసుకోవాలంటే మొబైల్ యాప్‌లోకి వెళ్లాలి. యాప్‌లో మీరు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్లాలే ఆ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. మీరు వెళ్లే దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. ఓలా ఫేర్ , ఉబర్ లేదా ఆటో ఇ రిక్షాలో వెళ్లాలా అనేది మీ ఇష్టం. టాక్సీ డ్రైవర్లు ఛార్జీలను ఎలా నిర్ణయిస్తారనే ప్రశ్నం చాలా మందితో తలెత్తుతుంటుంది. మీరు వెళ్లేది Ola లేదా Uber కావచ్చు. ఈ టాక్సీల ఛార్జీలు దూరం, ప్రయాణ సమయంపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు, పన్ను, సర్‌ఛార్జ్ కూడా జోడించబడతాయి. అందుకే మీరు కొన్నిసార్లు తక్కువ దూరం వెళ్లినా ఎక్కువగా వసూలు చేస్తారు.

కొన్ని సార్లు ఎక్కువ దూరం ప్రయాణించినా తక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. Ola, Uber ఛార్జీలు నగరం నుండి నగరానికి మారుతూ ఉంటాయి. Ola ధరను తెలుసుకోవడానికి మీరు Ola ఫేర్ ఫైండర్‌ని సందర్శించవచ్చు . ఇందులో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణించాలనేది ఈ రెండు విషయాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ‘గెట్ ఎస్టిమేట్’పై క్లిక్ చేయడం ద్వారా, మీరు ఛార్జీల సమాచారాన్ని పొందుతారు. దీనితో పాటు, Ola లేదా Uber అనేక ఇతర అంశాల ఆధారంగా ఛార్జీలను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు వాహనం మినీ, మైక్రో లేదా సెడాన్ అయినా, దూరం, సమయం, పన్ను, సర్‌ఛార్జ్, వెయిటింగ్ ఛార్జీ కూడా ఛార్జీలో చేర్చబడుతుంది. మీ నగరం ప్రకారం Ola, Uber ఛార్జీలను మీరు తెలుసుకోవచ్చు. దీని కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా , మీరు మీ నగరం ఛార్జీలను తెలుసుకోవచ్చు.

ఛార్జీని ఎలా నిర్ణయిస్తారు..?

ఛార్జీని నిర్ణయించడానికి అనేక అంశాలు పరిగణించబడతాయి. కనీస ఛార్జీలు కి.మీ., వెయిటింగ్ లేదా రైడ్ టైమ్ ఛార్జీలు, రాత్రి ఛార్జీలు, వర్తించే నైట్ టైమింగ్, నైట్ బిల్ లెక్కింపులు ఛార్జీలలో ఉంటాయి. ఈ అంశాలన్నింటి ఆధారంగానే ఛార్జీలను నిర్ణయిస్తారు. ఉదాహరణకు నోయిడా, ఢిల్లీకి ఓలా ధరను చూద్దాం. మీరు నోయిడాలో ఓలా టాక్సీలో ప్రయాణించినప్పుడు ప్రయాణం ప్రారంభించిన వెంటనే మీటర్ 25 రూపాయలు చూపిస్తుంది. ఆ తర్వాత మీ వాహనం కదులుతున్న కొద్దీ కిలోమీటరుకు రూ.5 చొప్పున చార్జీ పెరుగుతుంది. ఎక్కడో కారు ట్రాఫిక్‌ ఉండటం, పెట్రోల్‌ వేయించుకోవడంలో జరిగిన ఆలస్యాన్ని కూడా లెక్కిస్తారు. వెయిటింగ్ లేదా రైడ్ టైమ్ ఛార్జీలుగా కిలోమీటరుకు 1 రూపాయలు విధించబడుతుంది. ఈ ఛార్జీలన్ని మీరే చెల్లించాల్సి ఉంటుంది. ఇక రాత్రి ఛార్జీల విషయానికొస్తే సాధారణ ఛార్జీల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు.

ఇవి కూడా చదవండి:

India Post Mobile Banking: ఏ ఖాతాలలో మీరు పోస్ట్ ఆఫీస్ మొబైల్ బ్యాంకింగ్‌తో డబ్బును డిపాజిట్ చేయవచ్చు.. ఎలాంటి నిబంధనలు

Toilet Doors: మాల్స్‌, కార్యాలయాలలో టాయిలెట్ తలుపులు ఇలా ఎందుకు ఏర్పాటు చేస్తారు.. కారణం ఇదే..!