Ola S1 Z: మార్కెట్‌లో రెండు నయా స్కూటర్లను లాంచ్ చేసిన ఓలా.. వారే అసలు టార్గెట్..!

భారతదేశంలో ఓలా ఈవీ స్కూటర్లు అంటే ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల కాలంలో వరుస ఫిర్యాదులతో కొంత మేర కంపెనీ ఇబ్బంది పడుతున్నా వినియోగదారులకు మెరుగైన సర్వీస్ ఇస్తున్నామంటూ ఓలా పేర్కొంటుంది. తాజాగాా ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన శ్రేణిని రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఈ రెండు ఈవీ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Ola S1 Z: మార్కెట్‌లో రెండు నయా స్కూటర్లను లాంచ్ చేసిన ఓలా.. వారే అసలు టార్గెట్..!
Ola S1 Z
Follow us
Srinu

|

Updated on: Nov 29, 2024 | 4:10 PM

ఓలా కంపెనీ ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 ఈ పేరుతో తాజా ఈవీలను రిలీజ్ చేసింది.వ్యక్తిగత అవసరాల కోసం పట్టణ, సెమీ-అర్బన్ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్లను లాంచ్ చేసింది. ముఖ్యంగా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో  వచ్చే ఈ స్కూటర్‌లను చార్జ్ చేయడానికి పోర్టబుల్ హెూమ్ ఇన్వర్టర్ ఉపయోగించవచ్చు. ఫిక్స్‌డ్ బ్యాటరీలు ఉన్న స్కూటర్లతో పోలిస్తే రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్లతో వచ్చే స్కూటర్లను ఇటీవల వినియోగదారులు అధికంగా ఇష్టపడడంతో అన్ని కంపెనీలు రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్‌తో వచ్చే ఈవీలను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓలా కూడా తాజాగా రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్‌తో స్కూటర్లను రిలీజ్ చేసింది. ఈ బ్యాటరీలను ఈజీగా ఇంట్లో లేదా కార్యాలయంలో ఛార్జ్ చేయవచ్చు. 

ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 ఈ స్కూటర్లు కొన్ని భిన్నమైన వేరియంట్స్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. బేస్ మోడల్ వ్యక్తిగత ఉపయోగాలను అందిస్తుంది, టాప్-స్పెక్ జెడ్ ప్లస్ మోడల్ ప్రైవేట్ మరియు వాణిజ్య అవసరమయ్యేలా డ్యూయల్-యూజ్ ఈ-స్కూటర్‌గా లాంచ్ చేశారు. ఓలా ఎస్1 జెడ్ బాక్సీ సిల్హౌట్‌తో వస్తుంది. టాప్-స్పెక్ జెడ్ ప్లస్ వేరియంట్ రెండు చివర్లలో కార్గో రాక్స్, పిలియన్ సైడ్ స్టెప్, వైజర్, మొబైల్ ఫోన్ హెూల్డర్ వంటి అదనపు ఉపకరణాలతో వస్తున్నాయి. బేస్ వెర్షన్ 12 అంగుళాల చక్రాలతో వస్తుంది. అయితే ఎస్1జెడ్ ప్లస్ 14 అంగుళాల ఎంపికలతో వస్తుంది. ఈ రెండు మోడల్లు రైడర్ కోసం ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తున్నాయి. 

ఓలా ఎస్1 జెడ్ శ్రేణి 2.9 కేడబ్ల్యూ హబ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 4 బీహెచ్‌పీ శక్తితో వస్తుంది. ఓలా ఎస్1 జెడ్ 8 సెకన్లలో 20 కిలోమీటర్లకు చేరుకుంటుంది. అలాగే 4.8 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఓలా ఎస్1 జెడ్ 1.5 కేడబ్ల్యహెచ్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక బ్యాటరీ ప్యాక్‌తో ఎస్1 జెడ్ ఓ చార్జీపై ఐడీసీ సర్టిఫైడ్ 75 కిమీ పరిధిని అందిస్తుంది. ఓలా జెడ్1 రూ.59,999 ప్రారంభ ధరతో లాంచ్ చేశారు. అలాగే ఓలా ఎస్1 జెడ్ ప్లస్ వేరియంట్ రూ.64,999  ధరతో లాంచ్ చేశారు.  ప్రస్తుతం ఈ స్కూటర్లు 499 టోకెన్ మొత్తానికి బుకింగ్‌లను ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్ డెలివరీలు మే 2025న షెడ్యూల్ చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్కెట్‌లో రెండు నయా స్కూటర్లను లాంచ్ చేసిన ఓలా..!
మార్కెట్‌లో రెండు నయా స్కూటర్లను లాంచ్ చేసిన ఓలా..!
ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్..రెండు ఈవీ స్కూటర్లను లాంచ్ చేసిన హోండా
ఈవీ ప్రియులకు గుడ్‌న్యూస్..రెండు ఈవీ స్కూటర్లను లాంచ్ చేసిన హోండా
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
కావ్యమారన్ వద్దంది.. కట్‌చేస్తే.. 120 ఏళ్ల ప్రపంచ రికార్డ్ బ్రేక్
కావ్యమారన్ వద్దంది.. కట్‌చేస్తే.. 120 ఏళ్ల ప్రపంచ రికార్డ్ బ్రేక్
బుధ అస్తంగత్వ దోషం.. వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి
బుధ అస్తంగత్వ దోషం.. వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి
పెళ్లైన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
పెళ్లైన హీరోతో ఎఫైర్.. కట్ చేస్తే.. సినిమాలకు దూరం..
మరో నెలే గడువు.. ఆ రంగాల్లో పెట్టుబడితో అదిరే రాబడి
మరో నెలే గడువు.. ఆ రంగాల్లో పెట్టుబడితో అదిరే రాబడి
భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు వెనుక సర్కార్‌ ప్లానేంటి..?
భూసేకరణ నోటిఫికేషన్‌ రద్దు వెనుక సర్కార్‌ ప్లానేంటి..?
మార్పు మంచిదేనా.? పదోతరగతి పరీక్ష విధానం మార్పుపై ఏమంటున్నారు..
మార్పు మంచిదేనా.? పదోతరగతి పరీక్ష విధానం మార్పుపై ఏమంటున్నారు..
20 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్..గుర్తు పట్టారా?
20 ఏళ్ల నాటి ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ డైరెక్టర్..గుర్తు పట్టారా?