Ola Electric Scooter: ఓలా నుంచి మరో కొత్త ఈ-స్కూటర్.. స్వాపబుల్ బ్యాటరీతో లాంచింగ్ రెడీ.. ఆ స్కూటర్లతోనే పోటీ..
ఒక బ్యాటరీ చార్జింగ్ పెట్టుకొని మరో బ్యాటరీతో ఎంచక్కా మన బండిపై వెళ్లొచ్చు. ఈ రకం టెక్నాలజీని ఇప్పటికే హీరో మోటో కార్ప్, గోగోరో కంపెనీలు తమ ఈ-స్కూటర్లలో అమర్చి నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో వాటి నుంచి వస్తున్న పోటీని అధిగమించేందుకు ఓలా ఎలక్ట్రిక్ ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని, మార్చుకోదగిన బ్యాటరీతోకూడిన స్కూటర్లను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్.. భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న బ్రాండ్. ఇప్పటి వరకూ అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన, విక్రయిస్తున్న కంపెనీ. ఇప్పుడు మరో ముందడుగు వేసేందుకు రెడీ అయ్యింది. కొత్త టెక్నాలజీని స్కూటర్లలో ప్రవేశపెడుతూ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అదే స్వాపబుల్ బ్యాటరీ టెక్నాలజీ. అంటే మార్చుకోదగిన బ్యాటరీ అన్నమాట. ఒక బ్యాటరీ చార్జింగ్ పెట్టుకొని మరో బ్యాటరీతో ఎంచక్కా మన బండిపై వెళ్లొచ్చు. ఈ రకం టెక్నాలజీని ఇప్పటికే హీరో మోటో కార్ప్, గోగోరో కంపెనీలు తమ ఈ-స్కూటర్లలో అమర్చి నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో వాటి నుంచి వస్తున్న పోటీని అధిగమించేందుకు ఓలా ఎలక్ట్రిక్ ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని, మార్చుకోదగిన బ్యాటరీతోకూడిన స్కూటర్లను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.
పేటెంట్ కు దరఖాస్తు..
ఓలా ఎలక్ట్రిక్ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పేటెంట్ దాఖలు చేసింది. ఇది కమర్షియల్ మార్కెట్లో అడుగుపెడితే విద్యుత్ శ్రేణి స్కూటర్ల మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ-కామర్స్ సెగ్మెంట్లో సేల్స్ 2019లో సున్నా ఉండగా.. అది ఒకశాతం పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తం మార్కెట్కు మేలు చేకూరుస్తుంది.
ట్రెండ్ ప్రకారం, లాస్ట్-మైల్ కనెక్టివిటీ ఆవశ్యకత పెరుగుతోంది. ఓలా ఎలక్ట్రిక్ తన ఐపీఓ లాంచ్ కారణంగా మార్కెట్‌లోకి అడుగు పెట్టడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఆర్ అండ్ డీ విభాగంలో మరిన్ని పెట్టుబడులను చేపట్టడానికి కంపెనీకి లిక్విడ్ క్యాపిటల్ ఉంటుంది. అలాగే టాటా మోటార్స్, మెజెంటా మొబిలిటీ, ఫైన్ మొబిలిటీ, ఒమేగా సీకి, వంటి మార్కెట్లోని ప్రస్తుత ప్లేయర్‌లు ఎలా ప్రభావితం అవుతాయో కూడా గమనించడం ముఖ్యం. అయితే, వారి ఫ్లీట్, టార్గెట్ మార్కెట్ ఓలా కంటే భిన్నంగా ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ రెండు చక్రాలపై డెలివరీలను అందించగలదు, ఇది మిగిలిన ప్లేయర్‌ల కంటే భిన్నంగా ఉంటుంది.
ఓలా కొత్త స్కూటర్ ఇలా..
ఓలా ఎలక్ట్రిక్ తీసుకురానున్న కొత్త స్కూటర్లో కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ కొత్త స్కూటర్‌లో మార్చుకోగలిగిన బ్యాటరీలను తీసుకొస్తోంది. కాబట్టి కంపెనీ వారి ప్రస్తుత ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌తో పాటు రిమూవల్ బ్యాటరీల కోసం ఛార్జింగ్ ఎంపికలను కూడా సెటప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక సవాలుగా వారికి నిలుస్తుంది. దీని కోసం ఓలా ఎలక్ట్రిక్ ఇంతకు ముందే ఈ సదుపాయం అందుబాటులో ఉన్న హీరో మోటర్‌కార్ప్, గొగోరో వంటి బ్రాండ్‌లతో జతకట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొత్త స్కూటర్ ఎలా ఉంటుందంటే..
కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ స్కెచ్ మాత్రమే బయటకొచ్చింది. దానిని బట్టి కొత్త స్కూటర్‌లో పార్సెల్‌లను ఉంచడానికి విశాలమైన ఫుట్‌బోర్డ్ ఉంటుందని ఊహిస్తున్నారు. దీనితో పాటు, డెలివరీ అసిస్టెంట్‌కు గట్టి పట్టు ఉండేలా ఎర్గోనామిక్స్, వాహనం రూపకల్పన కచ్చితంగా సెట్ చేసి ఉంటుంది. ఈ కొత్త స్కూటర్ కు సంబంధించిన స్పెసిఫికేష న్లు, ఫీచర్లు వంటి పూర్తి వివరాలు ఓలా కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




