Real Estate: లగ్జరీ విషయం నో కాంప్రమైజ్.. పెద్ద సైజు అపార్ట్‌మెంట్లకు ఫుల్ డిమాండ్..
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో అత్యధిక శాతం మంది పెద్ద ఇళ్లలో సౌకర్యవంతంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనారాక్ తెలిపింది. దేశంలో ప్రముఖ నగరాల్లో సంస్థ చేసిన సర్వే డేటా ప్రకారం లగ్జరీ విల్లాలు, అపార్టుమెంట్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు స్పష్టం చేసింది. దేశంలోని టాప్-7 నగరాల్లో సగటు ఫ్లాట్ సైజులు ఏటేటా పెరుగుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

ప్రజల ఆలోచనా విధానం మారిపోయింది. ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడానికి ఇష్టపడటం లేదు. లగ్జరీ జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎంత డబ్బును అయిన వెచ్చించడానికి సిద్దపడుతున్నారు. అందుకు ప్రధాన ఉదాహరణ నివాస గృహం. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో అత్యధిక శాతం మంది పెద్ద ఇళ్లలో సౌకర్యవంతంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఈ విషయాన్ని దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనారాక్ తెలిపింది. దేశంలో ప్రముఖ నగరాల్లో సంస్థ చేసిన సర్వే డేటా ప్రకారం లగ్జరీ విల్లాలు, అపార్టుమెంట్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు స్పష్టం చేసింది. దేశంలోని టాప్-7 నగరాల్లో సగటు ఫ్లాట్ సైజులు ఏటేటా పెరుగుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. గతేడాదితో పోల్చితే ప్రజలు కోరుకుంటున్న ఫ్లాట్ పరిమాణం ఈ సారి 11 శాతం పెరిగిందని వివరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏయే నగరాల్లో పెరిగిందంటే..
- దేశంలోని టాప్ ఏడు నగరాల్లో సగటు ఫ్లాట్ సైజ్ 2022లో 1,175 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, 2023లో 1,300 చదరపు అడుగులకు పెరిగింది. అదే సమయంలో 2021లో ఇది 1,170 చదరపు అడుగులు కాగా 2020లో 1,167 చదరపు అడుగులుగా ఉందని అనారాక్ తన నివేదికలో తెలిపింది.
- టాప్-7 నగరాల్లో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్ ఢిల్లీ) గత ఏడాదిలో సగటు ఫ్లాట్ పరిమాణంలో అత్యధిక వృద్ధిని (37 శాతం) సాధించింది. 2022లో 1,375 చదరపు అడుగుల నుంచి 2023లో 1,890 చదరపు అడుగులకు చేరింది. ఈ ప్రాంతంలో డెవలపర్లు చురుకుగా ఉన్నారు. డిమాండ్‌ను ట్రాక్ చేయడం, పెద్ద గృహాలను నిర్మించడం చేస్తున్నారు. గృహ కొనుగోలుదారులు లగ్జరీ అపార్ట్‌మెంట్‌ల వైపు చూస్తున్నారు.
- 2023లో హైదరాబాద్‌లో అత్యధిక సగటు ఫ్లాట్ సైజు 2,300 చ.అ.లు, ఇదిఎన్‌సీఆర్ కన్నా అధికం. ఇతర దక్షిణాది నగరాల్లో చెన్నై, బెంగళూరుల్లో సగటు ఫ్లాట్ సైజులు వరుసగా 1,260, 1,484 చ.అ.లు, ఇక పూణే సగటు ఫ్లాట్ పరిమాణం 2023లో 1,086చదరపు అడుగులుగా ఉంది.
ఈ నగరాల్లో తగ్గింది కూడా..
అయితే ఈ ఫ్లాట్ పరిమణాల్లో తగ్గుదలే కాదు కొన్ని నగరాల్లో తగ్గయని కూడా అనారాక్ చెప్పింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్), కోల్‌కత్తా నగరాల్లో మాత్రమే ఇది తగ్గిందని తెలిపింది. ఎంఎంఆర్‌లో సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 840 చదరపు అడుగులు కాగా 2023లో 794 చదరపు అడుగులకు తగ్గాయి. అంటే 5 శాతం వార్షిక క్షీణత. కోల్‌కతాలో, సగటు ఫ్లాట్ పరిమాణాలు 2022లో 1,150 చదరపు అడుగుల నుంచి 2023లో 1,124 చదరపు అడుగులకు తగ్గాయి. అంటే 2 శాతం క్షీణతను చూసాయి. అయితే గత 5 సంవత్సరాల కాలంతో పోల్చితే సగటు ఫ్లాట్ సైజులు 12 శాతం పెరిగాయి. 2019లో నగరంలో సగటు ఫ్లాట్ పరిమాణం 1,000 చదరపు అడుగులుగా ఉంది.
కారణం కరోనా..
అనారాక్ గ్రూప్ ఛైర్మన్ అనూజ్ పూరి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా పెద్ద-పరిమాణ గృహాలకు డిమాండ్ ప్రారంభమైందని.. అది కొనసాగుతోందని చెప్పారు. రానున్న కాలంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




