Business Ideas: ఇన్నోవేటివ్ బిజినెస్.. నెలకు రూ.60 వేల సంపాదన! జాబ్ చేస్తూ కూడా చేయొచ్చు!
ఈ బిజీ ప్రపంచంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారి కోసం న్యూట్రిషియన్ ఫుడ్ బిజినెస్ అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో, కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ప్రొటీన్, ఫైబర్ కలిగిన భోజనం తయారుచేసి డెలివరీ చేయవచ్చు. కస్టమైజ్డ్ మెనూ తో అధిక లాభాలు పొందవచ్చు.

బిజినెస్ చేయాలంటే గట్స్ కావాలని చాలా మంది అంటూ ఉంటారు. అది చాలా వరకు నిజమే. పైగా కొత్త రకం బిజినెస్ చేయాలంటే మాత్రం వంద శాతం గుండె ధైర్యం కావాలి. పెట్టుబడి చిన్నదైనా కూడా సక్సెస్ అవుతామో లేదో అనే భయాన్ని ముందు దాటాలి. అయితే కొత్తది ఎప్పుడు ట్రై చేసినా 90 శాతం మంచి ఫలితమే ఉంటుంది. అలాంటి ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ బిజినెస్.. ఈ బిజీ బతుకుల కాలంలో చాలా మంది తమ హెల్త్‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని మీరు బిజినెస్‌గా మార్చుకోవచ్చు. ఎవరైతే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారో వారు తమకు అవసరమైన అన్ని ఆరోగ్య విషయాలను పాటించలేరు. శారీరక వ్యాయామం అంటే అది కచ్చితంగా ఎవరి వారే చేయాలి, వారి తరఫున వేరే వాళ్లు చేయడం కుదరదు. కానీ, వారు తీసుకోవాల్సిన న్యూట్రిషియన్ ఫుడ్ మాత్రం వేరే వాళ్లు రెడీ చేయొచ్చు. ఇప్పుడు ఇదే మీ బిజినెస్.
ఉదయాన్నే జిమ్‌కి వెళ్లి.. తమకు ఏం చేవాలో ప్రొటిన్, ఫైబర్, ఐరన్ ఇలా అన్ని మెడికల్ టెర్మనాలజీలో లెక్కుల వేసి ఇంట్లో వండిపెట్టేవాళ్లు ఉండరు. కానీ, మీరు న్యూట్రిషియన్ ఫుడ్‌ను ప్రతి రోజు ఉదయమే పాలు, పేవర్ వచ్చేలా వారి ఇంటికి అందించగలిగితే సూపర్ బిజినెస్ అవుతుంది. వారి శరీర బరువుకు, వారి ఆరోగ్య పరిస్థితి తగ్గట్లు న్యూట్రిషియన్ ఫుడ్‌ను రెడీ చేసి ఇవ్వగలితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే ఉదయం పూట ఫ్రూట్స్ కట్ చేసి డబ్బాల్లో ఇంటికి పంపే బిజినెస్ కొన్ని చోట్లా స్టార్ట్ అయింది.
దాన్ని ఇంకాస్త అప్డేట్ చేసి అందిరికీ ఒకేలాంటి ఫ్రూట్స్, ఫుడ్ కాకుండా ఎవరికి ఎలాంటి ఫుడ్ అవసరం అవుతుందో అలాంటి న్యూట్రిషియన్ ఫుడ్ అందించగలిగితే సక్సెస్ అవ్వొచ్చు. పైగా దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువ. కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాతే మనం ఫుడ్ ప్రిపేర్ చేస్తాం కనుక ఇబ్బంది లేద. డెలవరీ కోసం స్టార్టింగ్‌లో మనమే వెళ్లి, బిజినెస్ పెరిగే కొద్ది డెలవరీ బాయ్స్‌ను కూడా పెట్టుకోవచ్చు లేదా సిగ్వీ, జోమాటోతో కూడా లింక్‌అప్ అవ్వొచ్చు. ఒక్కో కస్టమర్ నుంచి నెలకు రూ.3 వేలు తీసుకున్నా.. ఓ 20 మందికి ఈ సిర్వీస్ అందించినా నెలకు రూ.60 వేల ఆదాయం వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




