AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NPS అకౌంట్ తెరవడం ఇక ఈజీ.. భీమ్ యాప్‌ ద్వారా సెకన్లలోనే ఓపెన్.. టెన్షన్ తీరినట్లే..

నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) అకౌంట్ తెరవాలంటే గతంలో బ్యాంకులకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు డిజిటల్ విధానంలో నిమిషాల్లోనే తెరిచే అవకాశం కేంద్రం కల్పిస్తోంది. మీరు భీమ్ యూపీఐ యాప్ ద్వారా అత్యంత సులభంగా తెరవొచ్చు. ఈ మేరకు తత్కాల్ ఎన్‌పీఎస్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.

NPS అకౌంట్ తెరవడం ఇక ఈజీ.. భీమ్ యాప్‌ ద్వారా సెకన్లలోనే ఓపెన్.. టెన్షన్ తీరినట్లే..
Bhim App
Venkatrao Lella
|

Updated on: Oct 25, 2026 | 4:35 PM

Share

పదవీ విరమణ కోసం డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలు అమలు చేస్తోంది. వాటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) ఒకటి. దీని ద్వారా పదవి విరమణ తర్వాత ఆర్ధిక భద్రత పొందవచ్చు. రిటైర్మెంట్ కోసం స్థిరమైన ఆదాయం సంపాదించుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది. ఇంతకముందు ఈ అకౌంట్ తెరవాలంటే బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం, పోస్టాఫీస్‌కు వెళ్లడం లేదా వెబ్ సైట్ ద్వారా తెరిచే అవకాశం ఉండేది. కానీ ఇక నుంచి ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. మీ ఇంటి వద్దనే మొబైల్ ద్వారా యూపీఐ ఉపయోగించి సులువుగా ఎన్‌పీఎస్ ఖాతా తెరిచే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అదెలా అనేది చూద్దాం.

భీమ్ యాప్ ద్వారా మరింత సులభం

కేంద్రం కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అదే తత్కాల్ ఎన్‌పీఎస్. దీని ద్వారా భీమ్ యాప్ ఉపయోగించి సెకన్లలోనే ఎన్‌పీసీ ఖాతా తెరిచి డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. దీంతో వల్ల పదవీ విరమణ ప్రణాళిక మరింత సులభతరం కానుంది. సులువుగా అకౌంట్ తెరవడం, ఖాతాలో నగదు జమ చేయడం లాంటివి చేయవచ్చు. దీని వల్ల బ్యాంక్ బ్రాంచులను సందర్శించాల్సిన అవసరం ఉండదు. గతంలో బ్యాంక్‌కి వెళ్లి అప్లికేషన్ పూర్తి చేయడంతో పాటు అవసరమైన పత్రాలను అందించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దరఖాస్తు ఫారం, పత్రాలు అవసరం లేకుండా డిజిటల్‌గా అకౌంట్ తెరవొచ్చు. భీమ్ యాప్‌లోకి వెళ్లి ఎన్‌పీఎస్ ఆప్షన్ ఎంచుకుని ఖాతా తెరవొచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న బ్యాంక్ కేవైసీ వివరాలను ఉపయోగించుకుంటారు. ఈవిధానంతో అకౌంట్ తెరడానికి కనీసం రూ.250 జమ చేయాలి. ఆ తర్వాత అదనంగా రూ.10 నుంచి జమ చేయడం ప్రారంభించవచ్చు. దీని వల్ల తమ పదవీ విరమణ పొదుపును పెంచుకోవచ్చు.

భీమ్ యాప్ ద్వారా ఎలా తెరవాలి..?

-ముందుగా మీ ఫోన్‌లో భీమ్ యాప్ తెరవండి

-అనంతరం ఎన్‌పీఎస్ ఖాతా ఆప్షన్ ఎంచుకోండి

-మీ డేట్ ఆఫ్ బర్త్, బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి

-యూపీఐ ద్వారా తొలుత రూ.250 జమ చేయండి

-బ్యాంక్ ధృవీకరించిన కేవైసీ వివరాలను అంగీకరించండి

-ప్రస్తుతం తత్కాల్ ఎన్‌పిఎస్ సౌకర్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అందుబాటులో ఉంది

-రాబోయే రోజల్లో ఇతర బ్యాంక్ కస్టమర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు

-ఈ ఖాతాలో పెట్టుబడులు పెట్టినవారికి పన్న ప్రయోజనాలు కూడా అందుతాయి

Follow Us