ఇక గంటలోపే రిటైల్ లోన్స్‌… ఎలా అప్లై చేయాలంటే..?

మీరు వ్యాపారం కోసం లోన్ తీసుకోవాలని ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లు లోన్ కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడక్కర్లేదు. కేవలం గంటలోపే.. మీకు లోన్ అప్రూవల్ చేయబడుతుంది. అది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు. అవును నిజమే మీరు చదువుతున్నది. వ్యాపారానికి లోన్లు తీసుకునే వారికోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు శుభవార్త అందించాయి. కస్టమర్లకు వేగంగా లోన్లు అందించేందుకు బ్యాంకులు సిద్ధమౌతున్నాయి. దీనికోసం అందుబాటులోకి అన్ని అవకాశాలను అందింపుచ్చుకుంటున్నాయి. గంటలోపే ప్రభుత్వ […]

ఇక గంటలోపే రిటైల్ లోన్స్‌... ఎలా అప్లై చేయాలంటే..?
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 12:51 PM

మీరు వ్యాపారం కోసం లోన్ తీసుకోవాలని ఎదురు చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లు లోన్ కోసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడక్కర్లేదు. కేవలం గంటలోపే.. మీకు లోన్ అప్రూవల్ చేయబడుతుంది. అది కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు. అవును నిజమే మీరు చదువుతున్నది. వ్యాపారానికి లోన్లు తీసుకునే వారికోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు శుభవార్త అందించాయి. కస్టమర్లకు వేగంగా లోన్లు అందించేందుకు బ్యాంకులు సిద్ధమౌతున్నాయి. దీనికోసం అందుబాటులోకి అన్ని అవకాశాలను అందింపుచ్చుకుంటున్నాయి.

గంటలోపే ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలు.. పోర్టల్‌ సేవలు రిటైల్‌ రుణాలకూ విస్తరించడం జరిగింది. దీంతో రిటైల్‌ లోన్ పొందేందుకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు. హౌస్‌లోన్, పర్సనల్ లోన్ ప్రతిపాదనలకు ఈ పోర్టల్‌ ఇకపై అందుబాటులో ఉండనుంది. త్వరలో ఆటో రుణాలకు సంబంధించి కూడా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ ఈ సేవలు స్మాల్, మీడియం ఇండస్ట్రీస్‌లకు (ఎంఎస్‌ఎంఈ) మాత్రమే అందుబాటులో ఉంది. 2018 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఎంఎస్‌ఎంఈలకు కోటి రూపాయల వరకూ ఈ పోర్టల్‌ ద్వారా రుణం పొందే సౌలభ్యం ఉంది. ఐటీ రిటర్నుల నుంచి బ్యాంక్‌ అకౌంట్ల వరకూ అందుబాటులో ఉన్న పలు ఎలక్ట్రానిక్‌ డాక్యుమెంట్లను పరిశీలనలోకి తీసుకుని వచ్చే డేటా పాయింట్లను అత్యుధునిక ఆల్గోరిథమ్స్‌ ద్వారా విశ్లేషించి తక్షణ రుణ లభ్యత కల్పించడం ఈ పోర్టల్‌ ముఖ్య ఉద్దేశం. 2019 మార్చి 31వ తేదీ వరకూ అందిన గణాంకాల ప్రకారం- ఈ రుణాల కోసం 50,706 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 27,893 ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) సహా దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ సేవలను 59 మినిట్స్ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఎస్‌బీఐ ఎండీ పీకే గుప్తా తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవలను ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్ల దగ్గరకు తీసుకువస్తామని వెల్లడించారు.

ఈ లోన్ అప్లై చేయాలనుకుంటే..

పీఎస్బీ లోన్ కోసం www.psbloansin59minutes.com అనే ఈ పోర్టల్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవాలి. ఈ పోర్టల్ అడ్వాన్స్‌డ్ ఆధారంగా పనిచేస్తుంది. కస్టమర్ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం.. ఈ పోర్టల్ ఐటీ, బ్యాంక్ స్టేట్ మెంట్ వంటి పలు విభాగాల నుంచి సమాచారాన్ని పరిశీలిస్తుంది. ఇదే లోన్ అమౌంట్‌ను కూడా నిర్ణయిస్తుంది. దరఖాస్తుదారుడిని బ్యాంక్‌తో లింక్ చేస్తుంది. ఇదంతా కేవలం గంటలోపే జరిగిపోతుంది.