Sensex: పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్

దేశీ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగీసింది. శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్ పరుగులు పెట్టింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 37,000 పాయింట్ల పైకి చేరింది. అయితే చివరకు సెన్సెక్స్ 337 పాయింట్ల లాభంతో 36,982 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 10,946 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, […]

Sensex: పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 5:00 PM

దేశీ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగీసింది. శుక్రవారం బెంచ్‌మార్క్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఆటో, మెటల్, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ల జోరుతో మార్కెట్ పరుగులు పెట్టింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 37,000 పాయింట్ల పైకి చేరింది. అయితే చివరకు సెన్సెక్స్ 337 పాయింట్ల లాభంతో 36,982 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 10,946 పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టీ 50లో మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతీ సుజుకీ 4 శాతం పెరిగింది. అదేసమయంలో ఇండియాబుల్స్ హౌసింగ్ పైనాన్స్, యస్ బ్యాంక్, సన్ ఫార్మా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 5 శాతం పడిపోయింది. నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే ముగిశాయి. మెటల్ ఇండెక్స్ దాదాపు 2 శాతం పెరిగింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2.61 శాతం పరుగులు పెట్టింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.48 శాతం తగ్గుదలతో 60.08 డాలర్లకు దిగొచ్చింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.53 శాతం తగ్గుదలతో 55.44 డాలర్లకు క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపీ రికవరీ అయ్యింది. 17 పైసలు లాభంతో ట్రేడవుతోంది. 71.67 వద్ద కదలాడుతోంది.

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌