Aadhar update: ఆధార్ అప్ డేట్ కోసం టెన్షన్ వద్దు.. ఈ టిప్స్ పాటిస్తే చాలా సులభం

దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అత్యంత అవసరం. నిత్యం నిర్వహించే ప్రతి పనికీ సాయపడుతుంది. ఇది దేశ పౌరులందరికీ గుర్తింపు కార్డు అని చెప్పవచ్చు. యూనిక్ ఐడెంటికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) పౌరులంరదికీ ఆధార్ కార్డులను జారీ చేస్తుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ 12 అంకెల నంబర్ ను జారీ చేస్తారు. ఈ కార్డులో పేరు, చిరునామా, వయసు, వేలిముద్రలు, ఐరిష్ తదితర వివరాలు ఉంటాయి.

Aadhar update: ఆధార్ అప్ డేట్ కోసం టెన్షన్ వద్దు.. ఈ  టిప్స్ పాటిస్తే చాలా సులభం
Aadhaar
Follow us

|

Updated on: Oct 23, 2024 | 2:15 PM

ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు, ప్రయాణం టిక్కెట్ల బుక్కింగ్, బ్యాంకు ఖాతాలు తదితర వాటికి ఆధార్ కార్డు అత్యవసరం. అయితే కార్డులో ఈ వివరాలన్ని సక్రమంగా ఉండాలి. లేకపోతే అనేక ఇబ్బందులు కలుగుతాయి. తప్పులు ఉంటే ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో చాలా సులువుగా మార్పులు చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగం, వ్యాపారం కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవాలి. అలాగే కొందరి పేర్లు, పుట్టిన తేదీ, తండ్రి పేరు తదితర వాటిలో తప్పులు దొర్లుతాయి. వాటిని వెంటనే సరిచేసుకోకపోతే ఇబ్బందులు కలుగుతాయి. వీటితో పాటు ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు, ఇంత వరకూ మార్పులు చేసుకోకుంటే తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలి. వారి కార్డులో వివరాలు అన్ని సక్రమంగా ఉన్నా అప్ డేట్ అవసరం.

చిన్న వయసులో ఆధార్ కార్డు తీసుకున్న పిల్లలకు ఇప్పుడు 15 ఏళ్లు నిండితే బయో మెట్రిక్ వివరాలను అప్ డేట్ చేయాలి. అలాగే ప్రమాదం, శస్త్రచికిత్స, వైద్యం నేపథ్యంలో వేలిముద్రలు, ఐరిష్ కు ఇబ్బంది కలిగితే వారందరూ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ పథకాలను పొందడంలో కార్డులో పేర్ల దోషాల వల్ల ఇబ్బందులు కలిగినా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆధార్ కార్డులో మార్పులన్నీ ఆన్ లైన్ విధానంలో కుదరవు. చిరునామా తదితర వాటిని మాత్రమే ఈ విధానంలో మార్చుకోవచ్చు. ఇక వేలిముద్రలు, ఐరిష్ తదితర వాటికి సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. పదేళ్లుగా అప్ డేట్ చేయని వారికి డిసెంబర్ 14వ తేదీ వరకూ ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు యూఐడీఏఐ అవకాశం కల్పించింది. బయో మెట్రిక్ వివరాలు నమోదు చేసుకునే వారికి ఉచిత సేవ వర్తించదు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ ఇలా

  • ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకునే వారు ముందుగా మైఆధార్.యూఐడీఏఐ.జీవోవీ.ఇన్ సందర్శించాలి.
  • మీ ఆధార్ నంబర్ ను దానిలో ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ)ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • ఆధార్ ఫ్రొఫైల్ లోని పేరు, చిరుమానా వంటి వాటిని పరిశీలించాలి. వాటిలో వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకోవాలి.
  • మీరు చేసిన మార్పును నిర్దారించే డ్యాక్యుమెంట్ ను అప్ లోడ్ చేయాలి.
  • మీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత మీకు ఒక నంబర్ వస్తుంది. దానితో అప్ డేట్ స్థితిని తనిఖీ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో