Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి అవసరం లేదు.. మనదేశంలోనే వాటిని తయారు చేయగలం!

ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకంపై భారతదేశంలో ట్విట్టర్ యుద్ధం  కొనసాగుతోంది.  ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ టెస్లా, హ్యుందాయ్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల  దిగుమతిపై సుంకం తగ్గింపు డిమాండ్ ను ఖండించారు.

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి అవసరం లేదు.. మనదేశంలోనే వాటిని తయారు చేయగలం!
Electric Vehicles
Follow us

|

Updated on: Jul 28, 2021 | 10:46 AM

Electric Vehicles:  ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకంపై భారతదేశంలో ట్విట్టర్ యుద్ధం  కొనసాగుతోంది.  ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ టెస్లా, హ్యుందాయ్ చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల  దిగుమతిపై సుంకం తగ్గింపు డిమాండ్ ను ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఆయన టెస్లా, హ్యుందాయ్ డిమాండ్ ను సరైనది కాదంటూ చెప్పారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకోవడం కాదు.. సొంతంగా తయారు చేస్తాం అంటూ ఆయన తెలిపారు. ”టెస్లా, హ్యుందాయ్ రెండు కంపెనీలు కోరుతున్న దానిని నేను అంగీకరించను.” అంటూ సోషల్ మీడియాలో భవీష్ అగర్వాల్ పేర్కొన్నారు. ”మీపై మీరు నమ్మకం ఉంచండి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులను ఆకర్షించండి. దిగుమతి మాత్రమే కాదు ఇక్కడే వాహనాలు తయారు చేసుకుందాం. ఇలా చేసే దేశం మనది ఒక్కటే కాదు.” అని భవీష్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

టెస్లా ఏం అడిగింది?

అమెరికన్  ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ  టెస్లా భారతదేశానికి ఎలక్ట్రిక్ కార్ల లేఖపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరింది. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల కంపెనీ ఎలక్ట్రిక్ కార్లు చౌకగా ఉంటాయని, ఇది మార్కెట్లో తమ డిమాండ్‌ను పెంచుతుందని, ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని టెస్లా చెప్పింది.

దిగుమతి సుంకం ఎంత ఉంది?

మన దేశంలో 30 లక్షల కన్నా తక్కువ ధర గల కారుపై 60% దిగుమతి సుంకం విధిస్తున్నారు. ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్ల ధర $ 40,000 (సుమారు 30 లక్షల రూపాయలు) కన్నా తక్కువ ఉంటే, అవి 60% దిగుమతి సుంకానికి లోబడి ఉంటాయి. అదే సమయంలో, $ 40,000 కంటే ఎక్కువ ధర గల కార్లు 100% దిగుమతి సుంకాన్ని భరించాల్సి వస్తుంది.

గతేడాది ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు విక్రయించారు?

గత సంవత్సరం 5000 ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. , ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల భారత మార్కెట్ ఇప్పటికీ కొత్తది. ఇక్కడి వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ఖరీదైనవి. మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో లోపం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు.  గత సంవత్సరం భారతదేశంలో విక్రయించిన  మొత్తం 2.4 మిలియన్ కార్లలో, 5,000 మాత్రమే ఎలక్ట్రిక్ కార్లు, వీటిలో ఎక్కువ ధర $ 28,000 కంటే తక్కువ.

భారత ప్రభుత్వం ఏమంటోంది?

భారతదేశంలో స్థానికంగా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించడానికి టెస్లా సిద్ధంగా ఉంటే కనుక భారత ప్రభుత్వం కంపెనీకి ప్రోత్సాహకాలను ఇవ్వగలదని చెబుతోంది. దీనివలన  చైనాతో పోటీ మన దేశం కూడా పడగలదని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మార్చిలో చెప్పారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి చౌకగా ఉంటుందని చెబుతున్నారు.

భవీష్ అగర్వాల్ ట్వీట్ ఇది..