AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Tips: సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్ ఎలా తీసుకోవాలి..? ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..

రుణం తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ అనేది తప్పనిసరి. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా లేకపోతే ఏ బ్యాంక్ కూడా రుణం మంజూరు చేయదు. మినిమిం 750కిపైగా ఉండాలని బ్యాంకింగ్ నిబంధనలు చెబుతున్నాయి. అయితే తొలిసారి జీతంలో చేరినవారికి మొదటి రుణం ఆమోదం పొందాలంటే అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

Financial Tips: సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్ ఎలా తీసుకోవాలి..? ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే చాలు..
Cibil Score
Venkatrao Lella
|

Updated on: May 29, 2026 | 12:14 PM

Share

లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకోవాలని అనుకున్నప్పుడు ముందుగా అందరికీ గుర్తుకువచ్చే పేరు సిబిల్ స్కోర్. క్రెడిట్ స్కోర్ 750 లేనిది ఏ బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ రుణం లేదా క్రెడిట్ కార్డు మంజూరు చేయదు. ఒకవేళ రుణం మంజూరు చేసినా అధిక వడ్డీ వసూలు చేస్తారు. ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందనేది క్రెడిట్ స్కోర్ ద్వారా తెలుస్తుంది. అందుకే క్రెడిట్ స్కోర్ అనేది అత్యంత ముఖ్యమైనది. అయితే క్రెడిట్ స్కోర్ లేనప్పుడు మొదటి లోన్ ఎలా పొందాలి..? ఎలా ఆమోదింపచేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

కొత్తగా ఉద్యోగంలో చేరేవారు ఏం చేయాలంటే..?

బ్యాంకింగ్ రుణ వ్యవస్థ ఎక్కువగా డేటాపై ఆధారపడి పనిచేస్తుంది. సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సిఆర్ఐఎఫ్ వంటి క్రెడిట్ బ్యూరోలు రుణాలు తీసుకునే తీరును పరిశీలిస్తాయి. 300 నుండి 900 మధ్య క్రెడిట్ స్కోర్‌లను కేటాయిస్తాయి. అధిక స్కోరు ఉంటే సదరు వ్యక్తి రుణాలు సకాలంలో చెల్లిస్తున్నాడని, అప్పును బాధ్యతాయుతంగా నిర్వహిస్తాడని ఆర్ధిక సంస్థలు అంచనా వేస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ రుణం తీసుకోకపోతే వారిని అంచనా వేయడానికి వ్యవస్థ ఏమీ ఉండదు. కొత్తగా సంపాదన మొదలుపెట్టినవారికి “NTC” – న్యూ టు క్రెడిట్ లేదా “-1” స్కోరుతో కనిపిస్తాయి. ఎటువంటి క్రెడిట్ హిస్టరీ అందుబాటులో లేదని దీనికి అర్ధం. దీని వల్ల స్థిరమైన జీతం ఉన్నప్పటికీ.. మొదటిసారి దరఖాస్తు రిజెక్ట్ చేస్తారు.

ఆమోదం పొందాలంటే ఏం చేయాలి..?

మొదటి రుణ ఆమోదం పొందాలంటే క్రెడిట్ గుర్తింపును ఏర్పరచుకోవాలని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ముందుగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం, దానిని యాక్టివ్‌గా ఉంచడం వంటివి చేయాలి. ఇక యుటిలిటీ బిల్లులు, అద్దె చెల్లింపుల వంటి సాధారణ ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవాలి. ప్రతిసారీ గడువు తేదీన లేదా అంతకంటే ముందే బకాయిలను చెల్లించాలి. మొదటి రుణం ఆమోదం పొందాలంటే.. చిన్న మొత్తంతో ప్రారంభించి నిలకడగా కొనసాగించాలని నిపుణులు చెబుతున్నారు. రుణాల కోసం నేరుగా దరఖాస్తు చేసుకోకుండా తక్కువ రిస్క్ ఉన్న ఉత్పత్తులతో ప్రారంభించాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో కూడిన సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మంచిది. దీని వల్ల రుణాలు వేగంగా మంజురు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. కేవలం క్రెడిట్ హిస్టరీ లేదనే కారణంతో తొలిసారి రుణం తీసుకునేవారికి మినహాయించడం ఉండదు. రుణాలు మంజూరు చేసే సంస్థలు రిస్క్‌ను అంచనా వేయడానికి ప్రత్యామ్నాయ డేటా, నగదు ప్రవాహ సంకేతాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.  జీతం క్రెడిట్‌లు, లావాదేవీల సరళి, పొదుపు ప్రవర్తన, ఖాతా కార్యకలాపాలను ఎక్కువగా పరిశీలిస్తారు. 

Follow Us