Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

For Farmers: రైతుల కోసం ఆ రాష్ట్రంలో కొత్త పథకం.. దీనితో పంటలకు మద్దతు ధర పొందటం ఈజీ.. అదేమిటో తెలుసుకోండి!

రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర పొందాలనుకుంటే కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

For Farmers: రైతుల కోసం ఆ రాష్ట్రంలో కొత్త పథకం.. దీనితో పంటలకు మద్దతు ధర పొందటం ఈజీ.. అదేమిటో తెలుసుకోండి!
For Farmers
Follow us
KVD Varma

|

Updated on: Aug 16, 2021 | 9:31 PM

For Farmers: రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర పొందాలనుకుంటే హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు వరి, జోవార్, బజ్రా, మొక్కజొన్న, మూంగ్, పత్తిని కనీస మద్దతు ధర (MSP) వద్ద విక్రయించాలనుకుంటే, రాబోయే రెండు వారాల్లో ‘మేరి ఫసల్ మేరా బయోరా’ పోర్టల్‌లో నమోదు చేసుకోండి. ఇది లేకుండా మీరు మీ పంటను ప్రభుత్వ రేటుకు విక్రయించలేరు. దీని చివరి తేదీ ఆగస్టు 31. వాస్తవానికి, ఈ పోర్టల్‌లో రైతుల నమోదు తప్పనిసరి చేశారు. తద్వారా ఎవరు ఎంత భూమిలో ఏ పంటను విత్తుకున్నారో తెలుస్తుంది. దాని విస్తీర్ణం ప్రకారం, ఆ రైతు నుండి సేకరణ కోటా నిర్ణయిస్తారు.

ఇటువంటి నమోదు ప్రక్రియ లేకపోతే, ఏ వ్యక్తి అయినా రైతుగా మారి పంటను ప్రభుత్వానికి విక్రయించవచ్చు. కొందరు నిజమైన రైతుల నుండి పంటలను చౌకగా కొనుగోలు చేస్తారు. వాటిని MSP వద్ద ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా లాభం పొందుతారు. ఇంతవరకూ దళారీలు చేస్తున్న పని అదే.  ఈ మోసాన్ని నివారించడానికి ప్రభుత్వం ఈ పోర్టల్‌ను రూపొందించింది. మీరు మీ పంటలను పూరించే వివరాల భౌతిక ధృవీకరణ కూడా ఉంటుంది. రైతులందరి వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పుడు, వారిని మార్కెట్ కు  పిలవడం సులభం అవుతుంది. రైతుల మొబైల్ నంబర్‌కు సందేశం పంపడం ద్వారా, వారు ఏ రోజు.. ఏ సమయంలో మార్కెట్‌కు రావాలి అని చెబుతారు. సరిగ్గా ఆ సమయానికి రైతులు తమ పంటను మార్కెట్ కు తీసుకువెళ్లి అమ్ముకుని తిరిగి రావచ్చు. ఇప్పుడు ఉన్న విధానంలో రైతులు మార్కెట్ యార్డ్ ల వద్ద తమ ఉత్పతులను అమ్ముకోవడానికి ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంది.

మెరి ఫసల్ మేరా బయోరా పోర్టల్ ప్రయోజనాలు

ఏదైనా ప్రకృతి విపత్తులో పంట దెబ్బతింటే, అప్పుడు పరిహారం సులభంగా లభిస్తుంది. ఎందుకంటే ఆ రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద రికార్డ్ చేసి ఉంటాయి. వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ కూడా సులభంగా లభిస్తుంది. వ్యవసాయానికి సంబంధించిన సమాచారం సకాలంలో లభిస్తుంది. విత్తన సబ్సిడీ అదేవిధంగా, వ్యవసాయ రుణం తీసుకోవడం కూడా సులభం అవుతుంది. పంట విత్తనాలు-కోత సమయం, మార్కెట్ సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది.

ఈ పత్రాలు అవసరం అవుతాయి..

  •  శాశ్వత నివాసిగా సర్టిఫికెట్.
  • దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డు.
  • మొబైల్ నంబర్ అవసరం.
  • నివాస ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు.
  • భూమికి సంబంధించిన పత్రాలు.
  • బ్యాంక్ ఖాతా సమాచారం, మొబైల్ నంబర్.

ఎలా దరఖాస్తు చేయాలి

  • మెరి ఫసల్ మేరా బయోరా పోర్టల్ యొక్క రైతుల విభాగంలో క్లిక్ చేయండి.
  • దీని తర్వాత రైతు నమోదు కాలమ్‌కి వెళ్లండి.
  • ఇక్కడ మొబైల్ నంబర్ మరియు క్యాప్చా నింపడం ద్వారా లాగిన్ చేయండి.
  • ఇక్కడ అడిగే అన్ని వివరాలను పూరించండి, సేవ్ చేయండి.
  • మీకు ఏవైనా సందేహాలు ఉంటే దాని టోల్ ఫ్రీ నంబర్ (1800 180 2060) ని సంప్రదించండి.

ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ఒక పథకం ఉంటె బాగుండును కదా. రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

Also Read: Social Media: సోషల్ మీడియా యాప్‌ల ఆదాయం ఎంత ఉంటుందో తెలుసా? వాటికి  ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే..

Post Office Savings: పోస్టాఫీస్ ఈ పథకంలో రోజుకి 70 రూపాయల పెట్టుబడితో.. లక్షల రూపాయలు తిరిగి పొందొచ్చు..ఎలానో తెలుసుకోండి!