Revolt RV400: స్టన్నింగ్ లుక్‌లో ఎలక్ట్రిక్ బైక్.. అధిక రేంజ్.. తక్కువ ధర.. పూర్తి వివరాలు ఇవి..
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ మన దేశ మార్కెట్లోకి స్టీల్త్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ రివోల్ట్ ఆర్‌వీ 400 ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. కంపెనీ ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్టీల్త్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేసినట్లు ప్రకటించింది. దీని ధర రూ. 1.17 లక్షలు (చార్జర్‌తో సహా) ఉంటుందని పేర్కొంది. ఆసక్తి గల వినియోగదారులు తమ సమీప డీలర్‌షిప్ లేదా ఆన్‌లైన్‌లో బైక్ ప్రీ బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది.

విద్యుత్ వాహనాలు క్రమక్రమంగా మార్కెట్‌లో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంటున్నాయి. సేల్స్ పుంజుకుంటున్నాయి. దీంతో పలు దిగ్గజ బ్రాండ్లే కాకుండా స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు, కార్లను మన దేశంలో లాంచ్ చేస్తున్నాయి. అయితే మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మాత్రమే ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. లోకల్ అవసరాలకు, ట్రాఫిక్ ప్రాంతాల్లో బాగా ఉపయుక్తంగా ఉంటుండటంతో ప్రజలు వాటినే కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు కూడా ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ స్కూటర్లనే లాంచ్ చేస్తున్నాయి. స్కూటర్లను లాంచ్ చేసినంతగా కంపెనీలు బైక్‌లను తీసుకురావడం లేదు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బైక్ లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ మన దేశ మార్కెట్లోకి స్టీల్త్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ రివోల్ట్ ఆర్‌వీ 400 ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. కంపెనీ ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్టీల్త్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ ను విడుదల చేసినట్లు ప్రకటించింది. దీని ధర రూ. 1.17 లక్షలు (చార్జర్‌తో సహా) ఉంటుందని పేర్కొంది. ఆసక్తి గల వినియోగదారులు తమ సమీప డీలర్‌షిప్ లేదా ఆన్‌లైన్‌లో బైక్ ప్రీ బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. బైక్ పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటుందని త్వరపడాలని సూచించింది. డెలివరీలు అక్టోబర్ 2023 నుండి ప్రారంభమవుతాయని రీవోల్ట్ వివరించింది. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రీవోల్ట్ ఆర్‌వీ400 బైక్ ఇలా..
స్టీల్త్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ రివోల్ట్ ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్ లుక్ సాధారణ మోడల్ లాగానే ఉంటుంది. కొన్ని ఆకర్షణీయమైన అంశాలు అదనంగా జోడించారు. బైక్ వెనుక స్వింగార్మ్, రియర్ గ్రాబ్ హ్యాండిల్, మోటార్‌సైకిల్ ఫ్రేమ్‌లోని కొన్ని భాగాలు, హ్యాండిల్‌బార్‌పై క్రోమ్ ట్రిమ్‌లను బ్లాక్ చేస్తుంది. ఇది పసుపు మోనో-షాక్, బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్‌తో గోల్డెన్ అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్‌లను పొందుతుంది. బైక్‌కు స్టెల్త్ బ్లాక్ పెయింట్ జాబ్ లభిస్తుంది. ఇది ముందు భాగంలో చిన్న ఫ్లాట్ స్క్రీన్‌ను కూడా పొందుతుంది. ఈ బైక్ గరిష్ట వేగం 85కిలోమీటర్లుగా ఉంది. దీనిలోని బ్యాటరీ 4.5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.
స్పెసిఫికేషన్లు ఇవి..
స్టీల్త్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ రివోల్ట్ ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్‌లో 3.24కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పూ 156 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. అలాగే 3 కిలోవాట్ల మిడ్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో ఈ బైక్ వస్తుంది.
ఫీచర్లు ఇవి..
స్టీల్త్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ రివోల్ట్ ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్‌లో డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రైడ్ మోడ్‌లు, ఈ-సిమ్‌తో మొబైల్ యాప్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 1.17లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. తక్కువ ధరలో బెస్ట్ రేంజ్, స్పెక్స్‌తో కూడిన ఎలక్ట్రిక్ బైక్ కావాలనుకొనే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.