Income Tax Refund: ఆదాయపు పన్ను వాపసు ఇంకా అందలేదా? ఈ మొత్తం ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోండి

ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన తర్వాత మీరు ఐటీఆర్‌ ఇ-వెరిఫికేషన్‌ను పొందడం అవసరం. ఇ-ధృవీకరణ ప్రక్రియ పూర్తి కాకపోతే మీ ఐటీఆర్‌ చెల్లదు. అంటే మీరు రెండు సార్లు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాపసు అందుకునే అవకాశం ఉండదు. ఐటీఆర్‌ వాపసు మీకు ఇంకా జారీ చేయబడలేదు. ఐటీఆర్‌ ఫైల్ చేసి చాలా కాలం గడిచినట్లయితే, అనేక కారణాల వల్ల దాని డబ్బు నిలిచిపోవచ్చు. అయితే ముందు మీరు మీ స్థితిని తనిఖీ చేయాలి..

Income Tax Refund: ఆదాయపు పన్ను వాపసు ఇంకా అందలేదా? ఈ మొత్తం ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోండి
Itr Filing
Follow us
Subhash Goud

|

Updated on: Aug 27, 2023 | 4:56 PM

ఆదాయపు పన్ను విషయంలో పలు నిబంధనలు మారిపోతున్నాయి. పన్ను చెల్లింపు దారులు ఎప్పటికప్పుడు మారిన రూల్స్‌ను తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేశంలో ఎంతో మంది ఆదాయపు పన్ను చెల్లింపులు చేస్తుంటారు. అలాంటి వారు పన్ను రిటర్న్‌ దాఖలు చేయడం కూడా చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను రిటర్న్‌ ఫైల్‌ చేసేటప్పుడు దరఖాస్తు ఫారమ్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉండాలి. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలైతో ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ITR ఫైల్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 వరకు జరిమానాతో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి రూ.1,000, వార్షికాదాయం రూ.5,000 కంటే ఎక్కువ ఉన్నవారికి జరిమానా విధిస్తారు.

ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన తర్వాత మీరు ఐటీఆర్‌ ఇ-వెరిఫికేషన్‌ను పొందడం అవసరం. ఇ-ధృవీకరణ ప్రక్రియ పూర్తి కాకపోతే మీ ఐటీఆర్‌ చెల్లదు. అంటే మీరు రెండు సార్లు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వాపసు అందుకునే అవకాశం ఉండదు. ఐటీఆర్‌ వాపసు మీకు ఇంకా జారీ చేయబడలేదు. ఐటీఆర్‌ ఫైల్ చేసి చాలా కాలం గడిచినట్లయితే, అనేక కారణాల వల్ల దాని డబ్బు నిలిచిపోవచ్చు. అయితే ముందు మీరు మీ స్థితిని తనిఖీ చేయాలి.

వాపసు రాకపోవడానికి కారణాలు ఏమిటి ?

మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన మొత్తం సమాచారం సరిగ్గా ఉండాలి. అలాగే ఇది ముందుగా ధృవీకరించబడాలి. ఖాతా ముందుగా ధృవీకరించబడకపోతే, మీరు వాపసు పొందలేరని గుర్తించుకోండి. ఇది కాకుండా మీ పాన్ కార్డ్‌ని బ్యాంక్‌తో లింక్ చేయడం కూడా ఎంతో అవసరం. బ్యాంకు ఖాతాతో పాన్ వివరాలు సరిపోలాలని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. అలాగే ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కూడా సరిపోలాలి.

ఇవి కూడా చదవండి

30 రోజుల్లోపు ధృవీకరణ

మీరు 30 రోజులలోపు ఐటీఆర్‌ ధృవీకరణను పొందకపోతే మీకు ఐటీఆర్‌ వాపసు అందదు. ఎందుకంటే మీ ఐటీఆర్‌ పూర్తయినట్లు పరిగణించబడదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి