AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

bicycles: కొత్త ట్రెండ్ గురూ.. తక్కువ ధరలో అదిరే ఫీచర్లతో అద్భుతమైన సైకిళ్లు.. చూస్తే వదలరు..

ట్రెమర్ ఎక్స్ సిరీస్ సైకిల్స్ రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుండగా.. అవలాన్ మోడల్ రూ. 14,000 నుంచి ప్రారంభమవుతోంది. అవలాన్ మోడల్ సైకిల్ కొనుగోళ్లపై నాయిస్ బీట్ స్మార్ట్ వాచ్ ఆ కంపెనీ కాంప్లిమెంటరీగా అందిస్తోంది. దీని విలువ రూ. 4,999గా ఉంది.

bicycles: కొత్త ట్రెండ్ గురూ.. తక్కువ ధరలో అదిరే ఫీచర్లతో అద్భుతమైన సైకిళ్లు.. చూస్తే వదలరు..
Firefox Bikes Tremor X Series, Avalon
Madhu
|

Updated on: Jun 23, 2023 | 1:36 PM

Share

ప్రముఖ ప్రీమియం సైకిల్ బ్రాండ్ ఫైర్‌ఫాక్స్ బైక్స్ సాహస క్రీడాకారుల కోసం ట్రెమర్ ఎక్స్ సిరీస్‌ సైకిల్స్ ను పరిచయం చేసింది. ఇది సవాలుతో కూడిన భూభాగాలలో కూడా చాలా సులువుగా, సులభంగా ప్రయాణించేందుకు వీలుంటుంది. అలాగే మహిళా బైకర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అవలాన్ మోడల్ ను కూడా అధికారికంగా ప్రకటించింది. ట్రెమర్ ఎక్స్ సిరీస్ సైకిల్స్ రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుండగా.. అవలాన్ మోడల్ రూ. 14,000 నుంచి ప్రారంభమవుతోంది. అవలాన్ మోడల్ సైకిల్ కొనుగోళ్లపై నాయిస్ బీట్ స్మార్ట్ వాచ్ ఆ కంపెనీ కాంప్లిమెంటరీగా అందిస్తోంది. దీని విలువ రూ. 4,999గా ఉంది. వినియోగదారులు ఫైర్ ఫాక్స్ స్టోర్స్ లేదా వెబ్ సైట్ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు.

ట్రెమర్ ఎక్స్ సిరీస్ ఇలా..

ఈ ట్రెమర్ ఎక్స్ సిరీస్ లైట్ వెయిట్ ఫ్రేమ్ ను కలిగి ఉంటుంది. దీనికి ఉపయోగించిన ఇంజినీరింగ్ మిమ్మల్ని సౌకర్యవంతమైన, ఆనందకరమైన రైడ్ ని అందిస్తుంది. దీనికి మెకానికల్ డిస్క్ బ్రేకులను అమర్చారు. దీని ద్వారా అద్భుతమైన కంట్రోల్ ని అందిస్తుంది. ఈ సైకిల్ రెండు ఆప్షన్లలో వస్తుంది. ఒకటి సింగిల్ స్పీడ్ వేరియంట్ ఇది సింప్లిసిటీ కొరుకొనే వారికి, అలాగే రెండోదీ 21ఎస్ షిమానో డ్రైవ్ ట్రైన్ వేరియంట్, దీనిలో చాలా రకాల గేర్ ఆప్షన్లు ఉంటాయి. అలాగే ట్రెమర్ ఎక్స్ సిరీస్ సైకిల్స్ వివిధ రకాల వీల్ సైజ్ లలో లభిస్తోంది.

అవలాన్ సైకిల్ ఇలా..

ఇది మహిళల కోసం ప్రత్యేకించిన బైక్. దీనిలో అదిరే ఫీచర్లు ఉంటాయి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లోని మహిళలకు ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. దీనిలో లైట్ వెయిట్ స్టీల్ ఫ్రేమ్ ఉంటుంది. గేర్ షిప్టింగ్ కోసం షిమానో షిఫ్టర్స్, డెరైల్యూర్స్ ఉంటాయి. ఎటువంటి భూభాగాల్లోనైనా సులువుగా ప్రయాణించగలిగే 700సీ టైర్స్ ఉంటాయి. దీనిలో శక్తివంతమైన వీ బ్రేక్స్ ఉంటాయి. ఇది రైడర్ సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తాయి. దీని పనితీరు, సౌకర్యం, స్టైల్ అన్ని కూడా మహిళలకు ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..