Stock Market: ఆ టాటా స్టాక్‌తో కష్టాలకు టాటా.. ఐదేళ్లల్లో నమ్మలేని రాబడి
ఇటీవల కాలంలో ప్రజల్లో పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువత చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో కాకుండా వివిధ కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేస్తూ రిస్క్ అయినా పర్లేదని పెట్టుబడులకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ కంపెనీ టాటాకు సంబంధించిన స్టాక్‌లు మంచి రాబడినిచ్చాయి.

టాటా టెలీ సర్వీసెస్ మహారాష్ట్ర (టీటీఎంఎల్) మరోసారి మార్కెట్ దృష్టిని ఆకర్షించింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో దాని స్టాక్ మంచి రాబడినిచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించడంలో పేరు పొందిన టీటీఎంఎల్ గత రెండు సెషన్లలో ఏకంగా 30 శాతం రాబడిని ఇచ్చింది. ముఖ్యంగా ఈ మల్టీబ్యాగర్ స్టాక్ తన అప్‌వర్డ్ ట్రెండ్‌ను కొనసాగించింది. శుక్రవారం కూడా ఈ ఎన్‌ఎస్ఈలో 2 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. ముఖ్యంగా మార్కెట్ సెంటిమెంట్ బాగా ఉండడంతో టీటీఎంఎల్ షేర్లు బాగా పెరిగాయి. నిఫ్టీ 204 పాయింట్లు తగ్గి 24,610 వద్ద ముగిసింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఈ స్టాక్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మార్చి 2025తో ముగిసిన త్రైమాసికంలో ఎఫ్ఐఐలు టాటా టెలిసర్వీసెస్ మహారాష్ట్రలో తమ వాటాను 2.5 శాతానికి పెంచుకున్నారు. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు రూ.15,000 కోట్లను అధిగమించింది. ఇటీవల 150 బిలియన్ల టాటా గ్రూప్‌నకు సంబంధించిన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ లిమిటెడ్, నష్టాల్లో ఉన్న దాని టెలికాం అనుబంధ సంస్థ టాటా టెలిసర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎస్ఎల్)కి కొత్త మూలధనాన్ని చొప్పించవచ్చని నివేదికలు వెలువడింది. దీంతో పెట్టుబడిదారులు టీటీఎంఎల్ స్టాక్స్‌ను కొనుగోలుకు ముందుకు వచ్చారు.
గత ఐదు సంవత్సరాలలో టాటా టెలీసర్వీసెస్ మహారాష్ట్ర పెట్టుబడిదారులకు 2,900 శాతం రాబడిని అందించింది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ 15 శాతం లాభపడింది. ఐదు సంవత్సరాల క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుడు ఇప్పుడు వారి పెట్టుబడి విలువ రూ. 2,981,132గా మారింది. ఐదు సంవత్సరాల క్రితం ఈ స్టాక్ విలువ కేవలం రూ. 2.65గా ఉండేది. ఇప్పుడు అది రూ. 79.45కి పెరిగింది. టీటీఎంెల్ స్టాక్ 5-రోజుల, 10-రోజుల, 20-రోజుల, 30-రోజుల, 50-రోజుల, 100-రోజుల, 150-రోజుల, 200-రోజుల సింపుల్ మూవింగ్ యావరేజ్‌ల కంటే ఎక్కువగా ట్రేడవుతోందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








