Mukesh Ambani: కొత్త కారు కొన్న అపర కుబేరుడు.. ధర ఎంతో తెలుసా?
ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు.
ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. రూ.13.14 కోట్లను ఖర్చుపెట్టి అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కల్లినాన్(Cullinan) హ్యాచ్‌బ్యాక్‌ను ఆయన కొనుగోలు చేశారు. ఆర్‌టీవో అధికారులు దేశంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారును సౌత్ ముంబయిలోని టార్డియో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ లో జనవరి 31న ఆర్‌ఐఎల్ కంపెనీ పేరుతో రిజిష్టర్ చేయించినట్లు ఆర్‌టీవో అధికారులు తెలిపారు. కాగా బ్రిటిష్ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ (Rolls Royce) మొదటిసారిగా 2018లో ఈ కారును విడుదల చేసింది. అప్పట్లో దీని కనీస ధర రూ.6.95 కోట్లు. అయితే కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఈ కారులో మార్పులు చేసిన తర్వాత ధర పెరుగుతూ వస్తోందని వాహన పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కాగా ఆర్‌ఐఎల్/ముకేశ్ ఖాతాలో ఇది మూడవ కల్లినాన్ మోడల్ కావడం విశేషం. 2.5 టన్నులకు పైగా బరువున్న ఈ 12 ఇంజిన్స్ కారు 564 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈసారి ముకేష్ ‘టుస్కాన్ సన్’ రంగును ఎంచుకున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.
రిజిస్ట్రేషన్ కోసం ఎంత ట్యా్క్స్ చెల్లించారంటే..
కాగా ఈ లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ కోసం రిలయన్స్ అధినేత ఏకంగా రూ.20 లక్షల పన్ను చెల్లించారట. దీని రిజిస్ట్రేషన్ 2037, 30 జనవరి వరకు చెల్లుబాటు అవుతుంది. దీంతో పాటు రోడ్ సేఫ్టీ ట్యాక్స్ కింద రూ.40 వేలు కూడా చెల్లించారు. కాగా తన కొత్త కారుకు 0001 వీఐపీ నంబరును సొంతం చేసుకున్నారు ముకేశ్. సాధారణంగా ఒక వీఐపీ నంబర్ కోసం సుమారు రూ. 4లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ముకేష్ అంబానీ ఎంచుకున్న నంబర్ ప్రస్తుతం సిరీస్‌లో అందుబాటులో లేదు. అందువల్ల, ఈ నంబర్ కోసం ఆర్‌టీవో కొత్త సిరీస్ ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇందుకోసం రవాణా కమిషనర్ నుంచి ఆర్‌టీఓ అధికారులు రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. దీని కోసం దరఖాస్తుదారులు సాధారణ నంబర్‌కు పేర్కొన్న ఛార్జీ కంటే మూడు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
PM Narendra Modi: హైదరాబాద్ పర్యటనకు ముందు ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారో తెలుసా?
Basara: బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం..