- Telugu News Photo Gallery Do this to avoid Warts, Follow these Tips, check here is details in Telugu
Warts Remedies: పులిపిర్లు రాకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో చేయండి..
చాలా మందిని వేధించే సమస్యల్లో పులిపిర్లు కూడా ఒకటి. ఇవి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రాకుండా ఏం చేయాలో ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. పులిపిర్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకపోయినా.. ముఖంపై వస్తే అందాన్ని తగ్గిస్తాయని చాలా మంది అపోహ..
Updated on: Jan 07, 2025 | 12:57 PM

పులిపిర్లు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి ఎక్కువగా ముఖంపై, చేతులపై వస్తూ ఉంటాయి. ఇతర భాగాలపై వచ్చినా పర్వాలేదు కానీ.. ముఖంపై వస్తే మాత్రం అందాన్ని పాడుచేస్తాయి. వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు. కానీ వీటి వలన అందం పాడవుతుందని భయపడుతూ ఉంటారు.

ఇవి రావడానికి అనేక కారణాలు ఉన్నా.. రాకుండా ఉండాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు పులిపిర్ల సమస్యను తగ్గించుకోవచ్చు. మరి ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయోలో తెలుసుకోండి.

సరైన శుభ్రత పాటించని కారణంగా ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి స్కిన్‌ని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేషన్ చేయడం వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి చర్మ రక్షణ చాలా ముఖ్యం.

అదే విధంగా ఎక్కువగా కాలుష్యం కారణంగా కూడా వస్తాయి. ముఖానికి ఎలాంటి రక్షణ లేకుండా బయట తిరిగే వారిలో కూడా ఈ పులిపిర్లు కనిపిస్తాయి. కాబట్టి బయట తిరిగే వారు కేర్ తీసుకోవాలి. అదే విధంగా ఎక్కువగా ఆయిల్ ఉండే ప్రాడెక్ట్స్ ఉపయోగించినా వస్తాయి.

షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకున్నా పులిపిర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కెర ఉన్న ఆహారాలు తక్కువగా తీసుకోవాలి. మేకప్ ఎక్కువగా వేసుకోవడం వల్ల కూడా పులిపిర్లు వస్తూ ఉంటాయి. కాబట్టి తరచూ చర్మాన్ని క్లీన్‌గా ఉంచుకోవడం ముఖ్యం. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




