Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI MPC Meet: 6 నుంచి ఆర్బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశం.. కీలక వడ్డీ రేటు యథాతథమేనా?

ద్రవ్యోల్బణం అదుపులోనికి వచ్చినట్లు కనిపించినప్పటికీ దీని అదుపులో కఠిన రేటు విధానాన్నే అవలంభించాలని ఆర్‌బీఐ కమిటీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్‌ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ గత ఏడాది2 మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి

RBI MPC Meet: 6 నుంచి ఆర్బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశం.. కీలక వడ్డీ రేటు యథాతథమేనా?
Rbi Mpc
Follow us
Subhash Goud

|

Updated on: Dec 05, 2023 | 1:13 PM

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం డిసెంబర్‌ 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఈ సమీక్ష సమావేశం అనంతరం పాలసీ వివరాలను 8వ తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వెల్లడిస్తారు. గవర్నర్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఎకానమీ వృద్ధే లక్ష్యంగా ప్రస్తుత యథాతథ రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగానే కొనసాగిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఒక వేళ ఈ రేటును యథాతథ కొనసాగించినట్లయితే ఈ తరహా నిర్ణయం తీసుకోవడం ఇది ఇది వరుసగా ఐదవసారి అవుతుంది.

కమిటీ విశ్లేషకులు ఏమంటున్నారంటే..

ద్రవ్యోల్బణం అదుపులోనికి వచ్చినట్లు కనిపించినప్పటికీ దీని అదుపులో కఠిన రేటు విధానాన్నే అవలంభించాలని ఆర్‌బీఐ కమిటీ భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్‌ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ గత ఏడాది2 మే నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోనికి వస్తుందన్న సంకేతాల వస్తున్న నేపథ్యంలో గత నాలుగు సమావేశాల్లో రేటును యథా విధిగా సాగించాలన్న నిర్ణయానికి రిజర్వ్‌ బ్యాంక్‌ పెద్ద పీట వేసింది.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ.. ఆర్‌బిఐ వడ్డీ రేట్లపై విరామం కొనసాగించి రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించే అవకాశం ఉందని అన్నారు. కారణం ఏమిటంటే, ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 5 శాతం కంటే తక్కువగా వచ్చింది. అలాగే మేలో ఇది మరింత తక్కువగా ఉంది. ఇది ఇలా ఉండగా, గత రెపో రేటు చర్యలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి. ఆర్‌బీఐ తీసుకునే వాస్తవ నిర్ణయాలు ఆర్థిక గణాంకాలు, ద్రవ్యోల్బణం పోకడలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుత సవాళ్లతో సహా పలు అంశాలపై ఆధారపడి ఉంటాయని నిపుణులు తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి