Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఈ వ్యాపారంతో నెలకు రూ. లక్షల్లో ఆదాయం.. ఎలా ప్రారంభించాలంటే..

నష్టం తక్కువ ఉండే వ్యాపారాల్లో రస్క్‌ బిస్కెట్‌ తయారీ ఒక బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గజిబిజీగా మారిన ఈ బిజీ లైఫ్‌లో ప్రజలు ఇన్‌స్టాంట్ ఫుడ్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం టిఫిన్‌, సాయంత్రం స్నాక్స్‌గా ఇలాంటి రస్క్‌లను తీసుకుంటున్నారు. అందుకే పలు బ్రాండెండ్‌ సంస్థలు సైతం రస్కల్‌ను తయారు చేస్తున్నాయి. లక్షల్లో లాభాలను ఆర్జిస్తున్నాయి. మరి మంచి ఆలోచన, కార్యచరణ ఉండాలనే కానీ మీరు కూడా తక్కువ...

Business Idea: ఈ వ్యాపారంతో నెలకు రూ. లక్షల్లో ఆదాయం.. ఎలా ప్రారంభించాలంటే..
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 05, 2023 | 8:50 AM

ప్రస్తుతం యువత ఆలోచన మారుతోంది. ఉద్యోగం కంటే వ్యాపారానికి సై అంటున్నారు. తాము సంపాదించడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆకాంక్షతో ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగా రకరకాల వ్యాపార ఐడియాలతో ముందుకువస్తున్నారు. ప్రభుత్వాల సహకారంతో రుణాలు పొందుతూ వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. తాము డబ్బులు ఆర్జించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియాతోనే ఇప్పుడు మీ ముందుకు వచ్చాం.

నష్టం తక్కువ ఉండే వ్యాపారాల్లో రస్క్‌ బిస్కెట్‌ తయారీ ఒక బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గజిబిజీగా మారిన ఈ బిజీ లైఫ్‌లో ప్రజలు ఇన్‌స్టాంట్ ఫుడ్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం టిఫిన్‌, సాయంత్రం స్నాక్స్‌గా ఇలాంటి రస్క్‌లను తీసుకుంటున్నారు. అందుకే పలు బ్రాండెండ్‌ సంస్థలు సైతం రస్కల్‌ను తయారు చేస్తున్నాయి. లక్షల్లో లాభాలను ఆర్జిస్తున్నాయి. మరి మంచి ఆలోచన, కార్యచరణ ఉండాలనే కానీ మీరు కూడా తక్కువ పెట్టుబడితో చిన్న చిన్న పట్టణాల్లో కూడా రస్క్‌ బిస్కెట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించవచ్చు. ఇంతకీ ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి కావాల్సి ఉంటుంది.? ఇందులో ఉండే లాభనష్టాలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రస్క్‌ బిస్కెట్‌ తయారీకి కనీసం 500 నుంచి 800 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఒకవేళ సొంత స్థలం లేకపోతే అద్దె తీసుకొని అయినా తయారీ కేంద్రాన్ని ప్రారంభించవచ్చు. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అయ్యే ఖర్చుపై ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఒక నివేదికను సిద్ధం చేసింది. దీని అంచనా ప్రకారం రస్క్‌ బిస్కెట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి సుమారు రూ. 40 లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే యూనిట్ ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం కలుపుకొని. ఈ నివేదక ఆధారంగా.. స్థలానికి రూ. 4 లక్షలు, ప్లాంట్‌తో పాటు మిషనరీకి రూ. 21.60 లక్షలు, ఫర్నిచర్‌కు రూ. 1.30 లక్షలు, ఇతర పరికరాలకు రూ. 2 లక్షలతో పాటు వర్కింగ్ క్యాపిటల్‌కు రూ. 11.11 లక్షలు అవసరపడుతుంది.

అయితే పెట్టుబడి ఎక్కువ అని భయాపడాల్సి పనిలేదు. ఒక్కసారి వ్యాపారం మొదలైతే లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకునే మీకు ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద బ్యాంకు రుణం అందిస్తుంది. దీని ద్వారా మీకు కనీసం రూ. 10 లక్షల వరకు లోన్‌ వస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. ఇక రస్క్‌ వ్యాపారం ద్వారా కనీసం నెలకు రూ. 70 వేలకిపైగా ఆర్జించవచ్చని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
అబద్ధం చెప్పేవారికి యముడు ఏ శిక్ష వేస్తాడో తెలుసా..?
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
మీ కలలలో వీటిని చూసినట్లయితే అమ్మవారు మీ పట్ల దయతో ఉందని అర్థమట
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
నా కొడుకును బలి పశువును చేస్తున్నారు.. పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి.
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!