GST: జీఎస్టీ వసూళ్లలో రికార్డ్.! రూ.1.66 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు..: మంత్రి నిర్మల
దేశీయంగా 2017 జూలై ఒకటో తేదీ నుంచి పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది సగటున రూ.1.66 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధామిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతి నెలా రూ.1.50 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరుగుతున్నాయన్నారు.
దేశీయంగా 2017 జూలై ఒకటో తేదీ నుంచి పన్నుల వ్యవస్థలో సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది సగటున రూ.1.66 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధామిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతి నెలా రూ.1.50 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లకు చేరాయన్నారు. ఈ ఏడాది సగటున రూ.1.50 లక్షల కోట్ల పై చిలుకు స్థూల జీఎస్టీ వసూళ్లు జరిగితే, 2022-23లో సగటున రూ.1.23 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని నిర్మలా సీతారామన్ తెలిపారు. సగటున ప్రతి నెలా జీఎస్టీ వసూళ్లు రూ.94,734 కోట్లు పెరిగాయన్నారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా.. 2021-22లో 30 శాతం, 2022-23లో 22 శాతం స్థూల జీఎస్టీ వసూళ్లు పెరిగాయన్నారు. వ్యాపారులు స్వయం మదింపు ప్రకారం జీఎస్టీ చెల్లిస్తున్నారని అన్నారు. ఒకవేళ జీఎస్టీ చెల్లించకున్నా, తక్కువ చెల్లించినా సంబంధిత వ్యాపారులపై చర్య తీసుకునే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉంటుందని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.