డబ్బు సంపాదించేవారు పాటించే గోల్డెన్ రూల్.. 7,5,3,1 స్ట్రాటజీ గురించి మీకు తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్ లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడానికి వ్యక్తులు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ను ఎక్కువగా ఎంచుకుంటుంటారు. ఇందులో పెట్టుబడిదారులు డబ్బు సంపాదించేందుకు ఒక గోల్డెన్ రూల్ ను ఫాలో అవుతారు. అదే 7531.. రూల్. ఈ స్ట్రాటెజీ తో బోలెడు లాభాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

సిప్ లో ఫాలో అయ్యే 7531 స్ట్రాటెజీ తెలుసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు అతి తక్కువ కాలంలోనే మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకోగలరు. మ్యూచువల్ ఫండ్స్ లో లభాలు పొందేందుకు గొప్పగా ఉపయోగపడుతోంది. ఈ రూల్ ఎలా పనిచేస్తుందో మీరూ తెలుసుకోండి..
రూల్ నంబర్ 7..
మొదటి నంబర్ ఏడు అనేది సిప్ విధానంలో పెట్టుబడి పెట్టేవారికి కాల వ్యవధిని సూచిస్తుంది. అంటే కనీసం 7 సంవత్సరాల పెట్టుబడిదారులు మార్కెట్ లో ఉండే అప్ అండ్ డౌన్స్ కు భయపడకుండా ముందుకు సాగితే ఈ పొదుపు నుంచి మాగ్జిమం లాభాలు గడిస్తారు.
ఉదాహరణకు.. ఏడాదికి 12 శాతం రాబడితో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో నెలకు రూ.5 వేల సిప్ ను ప్రారంభించవచ్చు. ఏడేళ్ల కాలంలో మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.6.75 లక్షలకు చేరుకుంటుంది. సిప్ లో ఈ విధంగా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ రేట్ స్థిరంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో తక్కువ కాలం పెట్టుబడులు మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్లు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.
రూల్ నంబర్ 5..
ఈ రూల్ లో నంబర్ 5 అనేది పెట్టుబడిదారులకు రిస్క్ తగ్గించడాన్ని సూచిస్తుంది. 5 వేర్వేరు ఆస్తి తరగతులలో వారి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచమని సలహా ఇస్తుంది. ఈ ఆస్తి తరగతులలో లార్జ్-క్యాప్ ఈక్విటీ ఫండ్‌లు, మిడ్-క్యాప్ ఈక్విటీ ఫండ్‌లు, స్మాల్-క్యాప్ ఈక్విటీ ఫండ్‌లు, ఇంటర్నేషనల్ ఫండ్‌లు మరియు డెట్ ఫండ్‌లు ఉంటాయి.
ఉదాహరణకు… ఒక పెట్టుబడిదారుడు తన సిప్ ను ఒకే దగ్గర కాకుండా వేర్వేరు మార్గాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్ లో రూ. 1,500, మిడ్ ఫండ్ లో రూ.1000 ఇలా రకరకాల ఫండ్స్ లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
రూల్ నంబర్ 3..
7-5-3-1 నియమం ప్రకారం, మూడు నెలల ఖర్చులను కవర్ చేసే అత్యవసర నిధిని ఉంచుకోవాలి. ఈ నిధి భద్రతా వలయంగా పనిచేస్తుంది, అత్యవసర సమయాల్లో పెట్టుబడిదారులు తమ క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలను ఆపకుండా కాపాడుతుంది. ఉదాహరణ: ఒక వ్యక్తి నెలవారీ ఖర్చులు రూ. 40,000 అయితే, వారి వద్ద రూ. 1.2 లక్షల అత్యవసర నిధి ఉండాలి. ఇది పెట్టుబడులను ముందస్తుగా రద్దు చేయవలసిన అవసరాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
రూల్ నంబర్ 1..
పెట్టుబడి మొత్తాన్ని పెంచడానికి ప్రతి సంవత్సరం సిప్ మొత్తాన్ని 1 శాతం పెంచాలని సూచిస్తుంది. ఈ చిన్న వార్షిక ఇంక్రిమెంట్ కాలక్రమేణా భారీ తేడాను కలిగిస్తుంది. సిప్ మొత్తాన్ని క్రమంగా పెంచడం ద్వారా, పెట్టుబడిదారులు ఆర్థిక ఒత్తిడిని అనుభవించకుండా అధిక రాబడిని పొందవచ్చు.
ఉదాహరణకు.. ఒక పెట్టుబడిదారుడు నెలకు రూ. 5,000 సిప్ తో ప్రారంభించాడుఅనుకోండి. ఒక సంవత్సరం తర్వాత, వారు ఆ మొత్తాన్ని 1 శాతం పెంచుతారు. తద్వారా అది రూ. 5,050 కి చేరుకుంటుంది. ఈ విధంగా పెట్టుబడిదారుడు తమ ఆర్థిక లక్ష్యాలను వేగంగా సాధించడంలో ఉపయోగపడుతుంది.




