AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone-16: మొబైల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఐఫోన్‌ 16పై భారీ తగ్గింపు!

iPhone-16: ఐఫోన్‌కు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఐఫోన్‌ 16న మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. యాపిల్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనే వారికి ఇది మంచి అవకాశం తక్కువ ధరల్లో ఐఫోన్‌ 16 మోడల్‌ను కొనుగోలు చేయవచ్చు..!

iPhone-16: మొబైల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఐఫోన్‌ 16పై భారీ తగ్గింపు!
భారత్ ఒక $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా వేగంగా పురోగమిస్తోంది. 2030 నాటికి $7 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యంలో టెక్నాలజీ రంగం $1 ట్రిలియన్ సహకారం అందించనుందని IBEF నివేదికలు సూచిస్తున్నాయి. ఆపిల్ వంటి కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ లక్ష్యం సాధ్యమయ్యే అవకాశం ఉంది. యువ కార్మిక శక్తి, పెరుగుతున్న దేశీయ వినియోగం భారత్‌ను ఆకర్షణీయ మార్కెట్‌గా మార్చాయి.
Subhash Goud
|

Updated on: Feb 04, 2025 | 7:08 PM

Share

మీరు ఐఫోన్ 16 కొనాలని ఆలోచిస్తుంటే ఇది మీకు గొప్ప అవకాశం. ఈ తాజా ఐఫోన్ మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,000 వరకు భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ డీల్ తమ పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి లేదా మొదటిసారి ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి చాలా బాగుంటుంది. ఈ ఆఫర్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఐఫోన్ 16 ధర, డిస్కౌంట్ ఆఫర్లు:

ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 16ను రూ.79,900 ప్రారంభ ధరకు విడుదల చేసింది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రస్తుతం రూ.5,000 డైరెక్ట్ డిస్కౌంట్‌తో రూ.74,900 కు లభిస్తుంది. ఇది కాకుండా మీకు ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్ లేదా SBI క్రెడిట్ కార్డ్ ఉంటే, మీరు రూ. 4,000 వరకు అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.

మీరు మరింత ఆదా చేయాలనుకుంటే, మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే అదనపు తగ్గింపు పొందే అవకాశాన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ మీకు అందిస్తోంది.

ఐఫోన్ 16 ఫీచర్లు:

  • 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే: HDR, ట్రూ టోన్ సపోర్ట్‌తో 60Hz రిఫ్రెష్ రేట్
  • 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌: సూర్యకాంతిలో కూడా స్క్రీన్ అద్భుతంగా చూడవచ్చు
  • A18 బయోనిక్ చిప్‌సెట్: 3nm టెక్నాలజీపై ఆధారపడిన ఈ ప్రాసెసర్ ఐఫోన్ 16 ను అత్యంత వేగవంతం చేస్తుంది.
  • బ్యాటరీ బ్యాకప్: వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 22 గంటల వరకు ప్లేబ్యాక్ సమయం
  • IP68 సర్టిఫికేషన్: నీరు, ధూళి నిరోధకం
  • 48MP కెమెరా: 2x ఆప్టికల్ జూమ్‌తో అద్భుతమైన ఫోటోగ్రఫీ
  • 12MP సెల్ఫీ కెమెరా: AI ఇమేజ్ ప్రాసెసింగ్‌తో మెరుగైన చిత్ర నాణ్యత
  • మీరు శక్తివంతమైన ప్రాసెసర్, గొప్ప డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరా నాణ్యత కలిగిన ఐఫోన్ కోరుకుంటే ఈ ఆఫర్ మీకు సరైనది కావచ్చు. ఈ డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో పరిమిత కాలం వరకు అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్ 16 కొనాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి