Maruti Suzuki: మారుతి కార్ల కస్టమర్లకు గమనిక.. అప్పుడు కొన్న వాహనాలన్నీ రీకాల్.. ఎందుకో తెలుసా..?
Maruti Suzuki: వాహనరంగంలో మారుతి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తక్కువ ధరలో, మంచి ఫీచర్లతో సామాన్యుడికి అందుబాటులో
Maruti Suzuki: వాహనరంగంలో మారుతి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తక్కువ ధరలో, మంచి ఫీచర్లతో సామాన్యుడికి అందుబాటులో ఉండేవిధంగా ఈ కార్లు ఉంటాయి. అయితే తాజాగా ఈ కంపెనీ కస్టమర్ల కోసం ఓ ప్రకటన చేసింది. మూడేళ్ల కిందట విక్రయించిన కార్లను వెనక్కు పిలిపించాలని నిర్ణయించింది. కొన్ని రకాలకు చెందిన కార్లల్లో లోపాలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మొత్తంగా 1,81,754 కార్లను రీకాల్ చేయనున్నట్లు పేర్కొంది.
ముఖ్యంగా ఇంధన పంపులో లోపాలు ఉన్నట్టు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ఖర్చు లేకుండా లోపాలను సరిదిద్ది కస్టమర్లకు కార్లు అందజేస్తామని ప్రకటించింది. 2018 మే 4 నుంచి 2020 అక్టోబర్ 27 మధ్యన భారత్‌తోపాటు ఇతర దేశాల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయిన కార్లను వెనక్కురప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇవి దాదాపుగా అయిదు మోడళ్లు కలిపి 1,81,754 వాహనాలు ఉంటాయి. ఇవన్నీ పెట్రోల్ వేరియంట్ కార్లే.
ఇందులో Ciaz, Ertiga, Vitara Brezza, S-Cross, Nexa-XL-6 మోడల్స్ ఉంటాయి. అయితే నీటితో నిండిన ప్రాంతాల నుంచి దూరంగా ఉండమని వినియోగదారులను హెచ్చరించింది. గతంలో కూడా మోటారు జనరేటర్ యూనిట్‌లో లోపం కారణంగా కొన్ని రకాల కార్లను స్వచ్ఛందంగా రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మారుతి కార్ల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.
అయితే ఇటీవల మారుతి కార్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఇన్‌పుట్ ధరలో నిరంతర పెరుగుదల కారణంగా సెప్టెంబర్ నుంచి అన్ని మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఒక సంవత్సరంలో మారుతి కార్లు ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఇన్‌పుట్ వ్యయం మొత్తం భారాన్ని కంపెనీ భరించదు. కనుక ఇది కొంత భాగాన్ని వినియోగదారుల జేబుల పైకి నెట్టేస్తోంది. కంపెనీ అన్ని మోడళ్లను ఖరీదైనదిగా చేయడం ఖాయం. కార్ల ధరలు ఎంత పెరుగుతాయో కంపెనీ ఇంకా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం, కంపెనీ ఎంట్రీ లెవల్ కారు ఆల్టో నుంచి హై ఎండ్ కార్ల వరకూ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 2.99 లక్షల నుంచి రూ .12.39 లక్షల వరకు ఉన్నాయి.