AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: ఇప్పుడు రూ.5 లక్షలకే వ్యాగన్‌ఆర్‌ కారు.. ఈ మోడళ్లపై భారీ తగ్గింపు!

Auto News: మారుతి సుజుకి తన SUV, MPV శ్రేణి ధరలను కూడా గణనీయంగా తగ్గించింది. కంపెనీ అత్యంత సరసమైన SUV, ఫ్రాంక్స్ ధర రూ.112,600 తగ్గింది. ఫ్రాంక్స్ ఇప్పుడు రూ.6.85 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అదనంగా బ్రెజ్జా ధర రూ.112,700 తగ్గింది. ఇప్పుడు మీరు బ్రెజ్జాను..

Auto News: ఇప్పుడు రూ.5 లక్షలకే వ్యాగన్‌ఆర్‌ కారు.. ఈ మోడళ్లపై భారీ తగ్గింపు!
Subhash Goud
|

Updated on: Sep 22, 2025 | 4:17 PM

Share

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నేడు తన కార్లపై గణనీయమైన ధరల తగ్గింపును ప్రకటించింది. మారుతి వ్యాగన్ఆర్ నుండి ఆల్టో, ఇగ్నిస్ వంటి చిన్న కార్ల వరకు కంపెనీ రూ.1.29 లక్షల వరకు ధరల తగ్గింపును ప్రకటించింది. ఈ ధరల తగ్గింపులు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చాయి. మారుతి సుజుకి విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఇటీవలి వస్తు, సేవల పన్ను (GST) సంస్కరణల ప్రయోజనాలను నేరుగా వినియోగదారులకు అందజేస్తామని పేర్కొంది. ఫలితంగా కంపెనీ తన పోర్ట్‌ఫోలియో అంతటా మోడళ్లపై ధరల తగ్గింపులను ప్రకటించింది. ప్రతి కారు ధర తగ్గింపులను పరిశీలిద్దాం.

ఇది కూడా చదవండి: Smart Tvs: కళ్లు చెదిరే ఆఫర్లు.. 70 శాతం డిస్కౌంట్‌తో స్మార్ట్‌ టీవీలు!

ఏ కారు ధరలో ఎంత తగ్గింపు:

Maruti Cars Rates 1

ఇవి కూడా చదవండి

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, అమ్మకాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ కార్ల ధరల తగ్గింపు ఇటీవలి GST సంస్కరణలకు అనుగుణంగా ఉందని అన్నారు. ధరల తగ్గింపు వాహన లక్షణాలు లేదా సాంకేతికతలో ఎటువంటి మార్పులను ప్రతిబింబించదన్నారు. ఈ కొత్త ధరల అప్‌డేట్‌తో ఆల్టో K10 ఇకపై మారుతి సుజుకి నుండి చౌకైన కారు కాదు.. బదులుగా మారుతి ఎస్-ప్రెస్సో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన కారుగా మారింది. ఈ కారు గరిష్ట ధర రూ.129,600 వరకు తగ్గింపును పొందింది. కార్ల ఎక్స్-షోరూమ్ ధరలు ఇక్కడ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: LIC Policy: ఐదేళ్లు కడితే చాలు.. జీవితాంతం నెల నెలా రూ.15 వేలు.. అద్భుతమైన పాలసీ!

ఇతర కార్లపై ధరల తగ్గింపు

మారుతి సుజుకి తన ప్రసిద్ధ స్విఫ్ట్ పై ₹84,600 ధర తగ్గింపును ప్రకటించింది. స్విఫ్ట్ ప్రారంభ ధర ఇప్పుడు రూ.5.79 లక్షలు మాత్రమే.  థర్డ్ జనరేషన్త స్విఫ్ట్ ఇటీవలే ప్రారంభించింది. ఆ సమయంలో దీనిని రూ.6.49 లక్షలకు అందించారు. అదనంగా బాలెనో ధర రూ.86,100 తగ్గింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలకు చేరుకుంది. కంపెనీ మొట్టమొదటి 5-స్టార్ సేఫ్టీ-రేటెడ్ కారు అయిన మారుతి డిజైర్ ధర కూడా తగ్గింది. ఈ కారు ధర గరిష్టంగా రూ.87,700 తగ్గింది. ఇప్పుడు మారుతి డిజైర్ కేవలం రూ.6.26 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Maruti Cars Rates 2

యుటిలిటీ వాహనాల శ్రేణిలో కూడా గణనీయమైన తగ్గింపు:

మారుతి సుజుకి తన SUV, MPV శ్రేణి ధరలను కూడా గణనీయంగా తగ్గించింది. కంపెనీ అత్యంత సరసమైన SUV, ఫ్రాంక్స్ ధర రూ.112,600 తగ్గింది. ఫ్రాంక్స్ ఇప్పుడు రూ.6.85 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అదనంగా బ్రెజ్జా ధర రూ.112,700 తగ్గింది. ఇప్పుడు మీరు బ్రెజ్జాను రూ.8.26 లక్షల ప్రారంభ ధరకు ఇంటికి తీసుకురావచ్చు. మారుతి ఎర్టిగా ధర రూ.46,400 వరకు తగ్గింది. దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ.8.80 లక్షలు. XL6 పై వినియోగదారులు రూ.52,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ SUV-శైలి MPV ఇప్పుడు రూ.11.52 లక్షల ప్రారంభ ధరతో వస్తుంది. అదనంగా వ్యాన్ విభాగంలో మారుతి ఈకో ధర రూ.68,000 తగ్గి రూ.5.18 లక్షలకు చేరుకుంది.

ఇది కూడా చదవండి: Airtel Plan: రూ.189 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రూ.17 వేల విలువైన ప్రయోజనాలు!

ఇది కూడా చదవండి: Pension Scheme: కేవలం రూ.210 డిపాజిట్ చేస్తే చాలు నెలకు రూ.5,000 పెన్షన్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి