AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruti Suzuki: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. వ్యాగనర్ నుంచి ఆల్టో వరకు రూ.40,000 తగ్గింపు..

Maruti Suzuki: కారు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి బంపర్ ఆఫర్లని ప్రకటించింది. ఫేమస్‌ వాహనాలైనా మారుతి

Maruti Suzuki: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. వ్యాగనర్ నుంచి ఆల్టో వరకు రూ.40,000 తగ్గింపు..
Maruti Suzuki
uppula Raju
|

Updated on: Mar 07, 2022 | 8:37 AM

Share

Maruti Suzuki: కారు కొనాలనుకునేవారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి బంపర్ ఆఫర్లని ప్రకటించింది. ఫేమస్‌ వాహనాలైనా మారుతి వ్యాగనర్ నుంచి ఆల్టో వరకు దాదాపు రూ.41, 000 వరకు తగ్గింపుని ప్రకటించింది. ఈ అవకాశం మార్చి 31, 2022 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో కారు కొంటే తక్కువ ధరకే వస్తుంది. అయితే ఏ మోడళ్లపై ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అందులో మొదటగా మారుతి సుజుకి వ్యాగనర్ ఆఫర్ ఈ విధంగా ఉంది. కంపెనీ ఇటీవల వ్యాగన్ఆర్‌ను 2 కొత్త ఇంజన్ ఎంపికలు, కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసింది. ఈ పరిస్థితిలో మునుపటి మోడల్స్ మిగిలిన స్టాక్‌లు ₹ 41000 వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నారు. దాని 1.2 లీటర్ వేరియంట్‌పై ₹ 41000, 1.0 లీటర్ వేరియంట్‌పై ₹ 31000 తగ్గింపు ఇస్తున్నారు. తర్వాత మారుతి సుజుకి ఆల్టో ఆఫర్ ఈ విధంగా ఉంది. CNG ఎంపికలో 796cc ఇంజన్, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉన్న ఆల్టో పెట్రోల్‌తో కూడా అందుబాటులో ఉంది. మారుతి ఆల్టో బేస్ వేరియంట్ ధర రూ.3.25 లక్షలు. మారుతి ఆల్టో కారుపై రూ. 31,000 వరకు తగ్గింపు లభిస్తోంది. అయితే బేస్ వేరియంట్‌పై కేవలం 11,000 తగ్గింపు మాత్రమే అందుబాటులో ఉందని గమనించండి.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి ఆల్టో మాదిరి ఎస్-ప్రెస్సో కూడా ₹31 వేల వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నారు. ఈ కారులో 68hp, 1.0 లీటర్ ఇంజన్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో ఉంటుంది. మారుతి S-ప్రెస్సో బేస్ వేరియంట్ ధర రూ.3.85 లక్షలు. ఈ వాహనం మాన్యువల్ వేరియంట్‌పై రూ. 31 వేల వరకు, AMT వెర్షన్‌పై 16 వేల వరకు తగ్గింపును అందిస్తోంది.

మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో 5 సీటర్, 7 సీటర్ వెర్షన్‌లలో వస్తుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ వాహనంపై కంపెనీ రూ.29 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన 7 సీట్ల కారు. దీని ధర రూ. 4.53 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కారు. కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్‌పై రూ.27 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో జత చేసిన 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. మారుతి స్విఫ్ట్ బేస్ వేరియంట్ ధర రూ. 5.90 లక్షలు. మార్చిలో దాని మాన్యువల్ వేరియంట్‌పై 27 వేల రూపాయల తగ్గింపు, AMT వెర్షన్‌పై 17 వేల రూపాయల వరకు తగ్గింపు ఉంటుంది.

7th Pay Commission: గుడ్‌న్యూస్‌.. వచ్చే నెల నుంచి వారి జీతాలు హైక్‌..!

Marriage: ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే బంపర్ ప్రయోజనాలు.. తెలిస్తే నిజమే అంటారు..!

ఈ పథకంలో నెలకి రూ.3000 పొదుపు చేస్తే చాలు.. 15 లక్షల నిధి మీ సొంతం..!