Cars: గతేదాది అత్యధికంగా అమ్ముడు పోయిన కారు ఇదే.. రూ. 6.6 లక్షల ధరలోనే..
గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి బలెనో మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. మొత్తం 1,95,660 యూనిట్ల విక్రయాలతో బలెనో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో టాటా ఆల్ట్రోజ్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ఈ కారు 70,162 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇక 69,988 యూనిట్ల విక్రయాలతో...

భారతీయ ఆటోమొబైల్ రంగంలో హ్యాష్‌బ్యాక్ కార్లకు ఉన్న డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మారుతి స్విఫ్ట్, వ్యాగనార్, బలెనో, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20, టయోటా గ్లాంజా వంటి కార్లు హ్యాష్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రాచుర్యం పొందాయి. హ్యాష్‌బ్యాక్ కార్ల నిర్వహణ తక్కువగా ఉండడం, ధర కూడా అందుబాటులో ఉండడమే ఈ కార్లకు ఉన్న డిమాండ్‌కు కారణంగా చెప్పొచ్చు. 2023-34 ఏడాదికి గాను ప్రీమియం సెగ్మెంట్ హ్యాష్ బ్యాక్ కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి.
గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి బలెనో మరోసారి అగ్రస్థానాన్ని సాధించింది. మొత్తం 1,95,660 యూనిట్ల విక్రయాలతో బలెనో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో టాటా ఆల్ట్రోజ్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం ఈ కారు 70,162 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇక 69,988 యూనిట్ల విక్రయాలతో హ్యూండాయ్ ఐ20 మూడో స్థానంలో నిలిచింది. 52,262 యూనిట్ల విక్రయాలతో టయోటా గ్లెంజా నాలుగో స్థానంలో నిలిచింది.
ఇక బలెనో కారు ఫీచర్ల విషయానికొస్తే ఇది 5 సీటర్ హ్యాష్ బ్యాక్ కారు. 1.2-లీటర్ దుల్జెట్ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు వస్తుంది. ఇది గరిష్టంగా 90bhp పవర్‌ను, 113Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో అందించారు. ఇక మారుతి సుజుకి బలెలోను సీఎన్‌జీ పవర్ ట్రెయిన్ ఆప్షన్‌లో కూడా తీసుకొచ్చారు.
ఇక ఈ కారు ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో 9 ఇంచెస్‌తో టచ్ స్క్రీన్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. అలాగే వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌తో పాటు Apple, Android CarPlay కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు. అలాగే భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇచ్చారు. ఇక ధర విషయానికొస్తే ఈ కారు బేస్ వేరియంట్ రూ. 6.6 లక్షల నుంచి రూ. 9.88 లక్షల ఎక్స్ షోరూమ్ ధర వరకు అందుబాటులో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..