AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Score: ప్రణాళికతో మెరుగదల సాధ్యం.. క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం చాలా సింపుల్

ఆర్థిక నిర్ణయాలు చిన్నవైనా, పెద్దవైనా తరచూ ఒక కీలకమైన అంశం మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చులు, అవసరాల నేపథ్యంలో అప్పు తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే బ్యాంకులు ఇటీవల క్రెడిట్ స్కోర్ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్ మెరుగుదల నిపుణులు చెప్పే టిప్స్‌ను ఓ సారి తెలుసుకుందాం.

Credit Score: ప్రణాళికతో మెరుగదల సాధ్యం.. క్రెడిట్ స్కోర్ పెంచుకోవడం చాలా సింపుల్
Nikhil
|

Updated on: Jun 17, 2025 | 4:47 PM

Share

ఒక వ్యక్తి డబ్బు నిర్వహణ, క్రెడిట్ నిర్వహణ, ఖర్చు తనిఖీ వంటి అంశాలపై ఆధారపడి క్రెడిట్ స్కోర్ ఉంటుంది. అయితే క్రెడిట్ స్కోర్‌పై ప్రజలకు అవగాహన పెరుగుతున్నా కొన్ని తప్పుల వల్ల స్కోర్ గణనీయంగా పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ స్కోరు అనేది కేవలం ఒక సంఖ్య కాదని, రుణగ్రహీత క్రెడిట్ ప్రవర్తన, తిరిగి చెల్లించే అలవాట్లతో పాటు మొత్తం ఆర్థిక విశ్వసనీయతను సూచిస్తుంది. క్రెడిట్ స్కోర్‌లు ఆర్థిక విశ్వసనీయతకు ఒక స్నాప్‌షాట్‌ను అందిస్తున్నప్పటికీ అవి మీరు ఆర్థికంగా అప్రమత్తంగా ఉండటానికి, మీ స్టేటస్ గురించి తెలుసుకోవడంలో సహాయపడే సాధనంగా కూడా పనిచేస్తాయి. 

క్రెడిట్ విలువను ప్రభావితం చేసే అంశాలను అర్థం చేసుకోవడం ప్రారంభం మాత్రమే, ఆ జ్ఞానం రోజువారీ ఆర్థిక నిర్ణయాలలో ఎలా వర్తింపజేయాలనే విషయం చాలా మందికి తెలియదు. కొత్త క్రెడిట్ కార్డ్ ఆఫర్‌ను అంచనా వేయడం, రుణం కోసం ప్రణాళిక వేయడం లేదా నెలవారీ ఖర్చులను నిర్వహించడం వంటి వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్, ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ స్థిరమైన క్రెడిట్ క్రమశిక్షణ ద్వారా నిర్మితమవుతాయి. సకాలంలో, పూర్తిగా బకాయిలను చెల్లించడం అనేది ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్‌ను నిర్మించాలని సూచిస్తున్నారు. అలాగే సకాలంలో చెల్లింపులు రుణదాతలకు విశ్వసనీయతను సూచిస్తాయి. భవిష్యత్తులో మెరుగైన క్రెడిట్ సౌకర్యాలకు మార్గం సుగమం చేస్తాయి. 

క్రెడిట్ స్కోర్ ఎడ్యుకేషన్ కూడా చురుకైన క్రెడిట్ నిర్వహణను ప్రోత్సహిస్తుంది. క్రెడిట్ నివేదికలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ద్వారా వ్యత్యాసాలను గుర్తించవచ్చు. అలాగే వారి పురోగతిని ట్రాక్ చేయవచ్చు.  దేశవ్యాప్తంగా క్రెడిట్ యాక్సెస్ విస్తరిస్తున్నందున ఆర్థిక అవగాహనను బలోపేతం చేయడానికి సంబంధించిన ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది. దీనికి ప్రతిస్పందనగా, క్రెడిట్ బ్యూరోలు, రుణదాతలు మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఆర్థిక సమాచారాన్ని సరళీకృతం చేయడానికి, బాధ్యతాయుతమైన రుణాలను ప్రోత్సహించడానికి మరియు క్రెడిట్ నివేదికలను మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి