Retirement Plans: రిటైర్‌మెంట్ లైఫ్ హ్యాపీగా సాగాలా? ఈ టిప్స్ పాటిస్తే సాధ్యమే
భారతదేశంలో ప్రజలు చాలా మంది పొదుపు అంటే కొంత చిన్నచూపు చూస్తారు. ముఖ్యంగా యువత ఇటీవల కాలంలో పొదుపును అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే ప్రస్తుతం చిన్న మొత్తాలతో చేసే పొదుపు పదవీ విరమణ జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పదవీ విరమణ ప్రణాళికల విషయంలో నిపుణులు చెప్పే టిప్స్ తెలుసుకుందాం.

చాలా మంది ప్రతిరోజూ భవిష్యత్తు గురించి కలలతో పదవీ విరమణ చేస్తారు.ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత వృద్ధ్యాప్యంలో అనారోగ్య సమస్యలు చాలా మందికి వస్తాయి. అలాగే ఇతర అవసరాలకు కూడా సంతానంపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి కష్టాలు లేకుండా భవిష్యత్‌పై ఆలోచనతో పొదుపు బాట పట్టాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే జీవితం సుఖంగా ఉండాలంటే ముఖ్యంగా కొన్ని టిప్స్ పాటిస్తే పదవీ విరమణ జీవితం సాఫీగా సాగుతుందని పేర్కొంటున్నారు.
ఆలస్యంగా పదవీ విరమణ
ఎవరైనా ఒక నిర్దిష్ట వయస్సు వరకు పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఓపిక ఉన్నంత వరకు కష్టపడాలని కొంత మంది అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మీకు పదవీ విరమణ వయస్సు వచ్చినా మీ కంపెనీ సహకారంతో మీ సర్వీస్ ఎక్స్‌టెన్షన్‌ను కోరవచ్చు.
ఒంటరి జీవితం
భార్యాభర్తలు కలిసి చనిపోకపోవచ్చు. కాబట్టి ఒకరు సుదీర్ఘమైన, ఒంటరి జీవితానికి సిద్ధంగా ఉండాలి. చాలా మంది వ్యక్తులు పదవీ విరమణ, ఆప్తుల మరణం వారి జీవితాల్లో వచ్చే మార్పులను తక్కువగా అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో స్నేహితులతో సత్సబంధాలు ఏర్పరచుకుంటే ఒంటరి అనే ఫీలింగ్ రాదని నిపుణులు చెబుతున్నారు.
లక్ష్యాలు
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం అవసరం. అది అభిరుచులను అనుసరించడం అయినా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం అయినా లేదా కొత్త భాష నేర్చుకోవడమైనా ఓ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా లక్ష్యసాధన కోసం సమయాన్ని కేటాయించాలని పేర్కొంటున్నారు.
డబ్బు
పొదుపు చేసుకున్న డబ్బు అంతా అయిపోతుందనే భయం పదవీ విరమణ జీవితంలో టెన్షన్లకు కారణం కావచ్చు. ముఖ్యంగా అనవసరమైన బడ్జెట్ ఖర్చులకు పరిమితుల్లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే సరైన పదవీ విరమణ ప్రణాళికను పాటిస్తే డబ్బు టెన్షన్ ఉండదని నిపుణులు వివరిస్తున్నారు.
రోజువారీ ఖర్చులు
చాలా మంది రోజువారీ ఖర్చుల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ముఖ్యంగా ధరల పెరుగుదల ఆందోళనకు ప్రధాన కారణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పదవీ విరమణ ప్రణాళికల్లో ప్రతి ఐదేళ్లకు ఓ సారి సొమ్ము వచ్చేలా పొదుపు చేయాలని నిపుణులు వివరిస్తున్నారు.
అనారోగ్యం
పదవీ విరమణ ప్రణాళికలో వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చులు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండవచ్చు. డబ్బును నిర్వహించే జీవిత భాగస్వామితో కలిసి అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా వైద్య బీమాతో వ్యక్తిగత బీమాలో పెట్టుబడి మీకు భయం లేకుండా చేస్తాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








