Mahindra Thar Roxx: మహీంద్రా ‘రాక్స్’తో.. మార్కెట్ షేక్.. 5 డోర్ల కొత్త ఎస్‌యూవీతో సెన్సేషన్.. ప్రత్యేకతలు ఇవే..

దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో ఎస్‌యూవీ విడులైంది. థార్ రాక్స్ పేరుతో ఆవిష్కరించిన ఈ 5 డోర్స్ ఎస్‌యూవీ ఎంతో ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.12.99 లక్షలుగా నిర్ణయించారు. మహీంద్రా నుంచి విడుదలైన థార్ కారుకు దేశంలో ఎంతో క్రేజ్ ఉంది. ఇది అమ్మకాలలో రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో థార్ రాక్స్‌‌పై అనేక అంచనాలు నెలకొన్నాయి.

Mahindra Thar Roxx: మహీంద్రా ‘రాక్స్’తో.. మార్కెట్ షేక్.. 5 డోర్ల కొత్త ఎస్‌యూవీతో సెన్సేషన్.. ప్రత్యేకతలు ఇవే..
Mahindra Thar Roxx
Follow us
Madhu

|

Updated on: Aug 15, 2024 | 4:18 PM

దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో ఎస్‌యూవీ విడులైంది. థార్ రాక్స్ పేరుతో ఆవిష్కరించిన ఈ 5 డోర్స్ ఎస్‌యూవీ ఎంతో ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.12.99 లక్షలుగా నిర్ణయించారు. మహీంద్రా నుంచి విడుదలైన థార్ కారుకు దేశంలో ఎంతో క్రేజ్ ఉంది. ఇది అమ్మకాలలో రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో థార్ రాక్స్‌‌పై అనేక అంచనాలు నెలకొన్నాయి. దేశంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు అనేక ఫీచర్లతో కార్లను విడుదల చేస్తున్నాయి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా నూతన మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. మహీంద్రా కంపెనీ నుంచి విడుదలైన థార్ కారుకు ఎంతో ఆదరణ లభించింది. అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దానికి కొనసాగింపుగా 5 డోర్ థార్ రాక్స్ ఎస్‌యూవీని ఆ కంపెనీ విడుదల చేసింది.

ఆకట్టుకునే ఫీచర్లు..

మహీంద్రా కంపెనీ థార్ 3-డోర్ ఎస్‌యూవీని నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2020 ఆగస్టు 15న విడుదల చేసింది. ఇప్పుడు 2024లో థార్ 5- డోర్ కారును ఆవిష్కరించింది. థార్ 3 తో పోల్చితే ఈ కారు మరింత ఎక్కువగా ప్రజలకు చేరువ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఫీచర్ల పరంగా థార్ 5 ఎంతో ఆకట్టుకుంటోంది. దీని బేస్ మోడల్ రూ.12.99 లక్షలు, బేస్ డీజిల్ మోడల్ రూ. 13.99 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఇక మిడ్, టాప్-స్పెక్ వేరియంట్ల ధరలను త్వరలో వెల్లడిస్తారు.

ఆకట్టుకుంటున్న డిజైన్..

మహీంద్రా థార్ 5 డోర్ కారు డిజైన్ ఎంతో ఆకట్టుకుంటోంది. ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువగా మార్పులు చేశారని తెలుస్తోంది. వెనుక క్వార్టర్ గ్లాస్ త్రిభుజాకారంలో మందంగా ఉండే బి పిల్లర్‌కు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా థార్ రాక్స్ కు స్లాంటెడ్ రూఫ్‌ ఏర్పాటు చేశారు. గతంలో విడుదలైన మూడు డోర్ల మోడల్‌కు భిన్నంగా కొత్గగా అల్లాయ్ వీల్ డిజైన్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అవుట్‌గోయింగ్ మోడల్ కు ఏర్పాటు చేసిన వృత్తాకార వెనుక చక్రాల ఆర్చ్‌లను కొత్తగా స్క్వారీష్ వీల్ ఆర్చ్‌లతో మార్పు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహీంద్రా థార్ రాక్స్ రెండు ఇంజిన్ల ఎంపికలలో అందుబాటులో ఉంది. 2.0ఎల్ టర్బో పెట్రోల్, 2.2ఎల్ టర్బో డీజిల్ ఇంజిన్లలో విడుదల చేశారు. అలాగే 6 స్పీడ్ ఎంటీ, 6 స్పీడ్ ఏటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి.

అధునాతన సస్పెన్షన్ సెటప్..

మహీంద్రా థార్ రాక్స్ లోని ఆఫ్-రోడ్ పరికరాల విషయానికి వస్తే 3 డోర్ మోడల్ కంటే అధునాతన సస్పెన్షన్ సెటప్ ను 5 డోర్ ఎస్ యూవీలో ఏర్పాటు చేశారు. ఇక వెనుక భాగంలో పెంటా లింక్ సస్పెన్షన్ సెటప్‌తో స్కార్పియో-ఎన్-డెరైవ్డ్ ఎఫ్‌ఎస్‌డి షాక్ అబ్జార్బర్లను ఉపయోగించుకుంటుంది. ముందు భాగంలో ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్, మెకానికల్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్‌ అమర్చారు. ఆఫ్‌రోడ్ క్రాల్ కంట్రోల్, ఇంటెల్లి టర్న్ అసిస్ట్ ఫీచర్ తో ఆకట్టుకుంటోంది.

అనేక అంచనాలు..

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఆఫ్ రోడర్ ఎస్ యూవీ కారు అయిన 5 డోర్ థార్ విడుదల కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 విడుదలైన 5 డోర్ థార్ రాక్స్ పై వారి అంచనాలను నిజం చేసేలా కనిపిస్తోంది. దీని న్యూ బంపర్ డిజైన్ తో ఎంతో ఆకట్టుకుంటోంది. రాత్రి వేళ ప్రకాశవంతంగా కనిపించేందుకు వీలుగా ముందు ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్ ఏర్పాటు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..