AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: ఆ ప్రత్యేక హోమ్‌లోన్‌తో రుణ బాధలు అధికం.. నిపుణుల ఆందోళనలకు కారణాలివే..!

టాప్-అప్ హోమ్ లోన్‌లు ప్రస్తుతం భారతదేశం మొత్తం చర్చనీయాంశంగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఈ రుణాల వేగవంతమైన వృద్ధి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది రుణదాతలు లోన్-టు-వాల్యూ  నిష్పత్తి, రిస్క్ టాలరెన్స్, తుది వినియోగాన్ని పర్యవేక్షించే నిబంధనలకు కట్టుబడి ఉండటం లేదని పేర్కొన్నారు. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణగ్రహీతలకు వారి ప్రస్తుత గృహ రుణం పైన అదనపు రుణంగా టాప్-అప్ హోమ్ లోన్‌ను అందిస్తాయి.

Home Loan: ఆ ప్రత్యేక హోమ్‌లోన్‌తో రుణ బాధలు అధికం.. నిపుణుల ఆందోళనలకు కారణాలివే..!
Home Loan
Nikhil
|

Updated on: Aug 15, 2024 | 4:30 PM

Share

టాప్-అప్ హోమ్ లోన్‌లు ప్రస్తుతం భారతదేశం మొత్తం చర్చనీయాంశంగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ఈ రుణాల వేగవంతమైన వృద్ధి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది రుణదాతలు లోన్-టు-వాల్యూ  నిష్పత్తి, రిస్క్ టాలరెన్స్, తుది వినియోగాన్ని పర్యవేక్షించే నిబంధనలకు కట్టుబడి ఉండటం లేదని పేర్కొన్నారు. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణగ్రహీతలకు వారి ప్రస్తుత గృహ రుణం పైన అదనపు రుణంగా టాప్-అప్ హోమ్ లోన్‌ను అందిస్తాయి. ఒక రుణగ్రహీత 18 24 నెలల పాటు గృహ రుణంపై క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూ ఉంటే వారు అదే రుణదాత నుంచి టాప్-అప్ హోమ్ లోన్‌ పొందవచ్చు. అయితే టాప్ అప్ హోమ్ లోన్ విషయంలో హోమ్ లోన్ తీసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాప్ అప్ హోమ్ లోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

టాప్-అప్ హోమ్ లోన్ పదవీకాలాన్ని హోమ్ లోన్ కాలవ్యవధి వరకు విస్తరించే అవకాశం ఉండడంతో లోన్ చెల్లించే వారికి ఈఎంఐలు భారంగా మారతాయి. చాల మంది రుణదాతలు పదవీ కాలాన్ని 15 సంవత్సరాలకు పరిమితం చేస్తారని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. టాప్-అప్ హోమ్ లోన్‌లు సాధారణంగా రెండు నుంచి మూడు వారాల్లోపు అందిస్తారు. అయితే కొంత మంది రుణదాతలు మాత్రం చిన్న మొత్తాలను అదే రోజు అందజేయడంతో వీటికి ఆదరణ పెరుగుతుంది. ఈ రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా గృహ రుణ వడ్డీ రేటు లేదా కొంచెం ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిగత లోన్, క్రెడిట్ కార్డ్‌పై లోన్ లేదా గోల్డ్ లోన్ వంటి ప్రత్యామ్నాయాల కంటే టాప్-అప్ హోమ్ లోన్ పొందడం సులువు అని అందువల్ల ఎక్కువ మంది ఈ లోన్‌ను ఆశ్రయిస్తున్నారని నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా ఇతర లోన్ ఎంపికలతో పోల్చుకుంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో వీటి ఆదరణ పెరిగిందని పేర్కొంటున్నారు.

టాప్ అప్ హోమ్ లోన్‌ను పొందడానిిక కనీస డాక్యుమెంటేషన్ అవసరం లేదు. ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న వారికి ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ రీపేమెంట్ టెన్యూర్ ఉంటే టాప్-అప్ హోమ్ లోన్‌ను పొందడం వల్ల ఇతర లోన్ ప్రత్యామ్నాయాల కంటే తక్కువ ఈఎంఐతో పెద్ద మొత్తంలో రుణాన్ని పొందవచ్చు. అయితే రుణం సులువుగా వస్తుండడంతో చాలా మంది ఈ లోన్ ఆశ్రయిస్తున్నా, సరైన అవసరం ఉంటే తప్ప లోన్ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇలా అధిక లోన్ తీసుకోవడం బడ్జెట్ పెరిగిపోతుందని పేర్కొంటున్నారు. ఈ రుణాలను వినియోగం, ఊహాజనిత ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రమాదమని వివరిస్తున్నారు.  సాధారణంగా టాప్ అప్ హోమ్ లోన్లు ఆస్తిపై గృహ మెరుగుదలకు నిధులు సమకూర్చడానికి ఉద్దేశించి రూపొందించినా.. కొందరు ఇంటి రీమోడల్ కంటే వాటిని వ్యక్తిగత అవసరాలకు వాడడంతో ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..