LPG Booking In WhatsApp: ఇకపై గ్యాస్ బుకింగ్ మరింత సులువు.. వాట్సాప్‌లో కేవలం నిమిషాల్లోనే.. ఎలా చేసుకోవాలంటే..
LPG Booking In WhatsApp: టెక్నాలజీ సహాయం పెరిగిన తర్వాత అన్ని పనులు సులువుగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం మెసేజింగ్ కోసమే ఉపయోగించిన వాట్సాప్ ఇప్పుడు పలు రకాల...
LPG Booking In WhatsApp: టెక్నాలజీ సహాయం పెరిగిన తర్వాత అన్ని పనులు సులువుగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం మెసేజింగ్ కోసమే ఉపయోగించిన వాట్సాప్ ఇప్పుడు పలు రకాల పనులను సైతం చేసి పెడుతోంది. తాజాగా వాట్సాప్ ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఇంతకీ వాట్సాప్ ద్వారా గ్యాస్ రీఫిల్ ఎలా చేసుకోవాలి.? సబ్సిడీ మీ అకౌంట్‌లోకి చేరిందా.? లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి.? లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..
వాట్సాప్‌తో హెచ్‌పీ గ్యాస్ బుకింగ్ ఇలా..
* ఇందుకోసం ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో 9222201122 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. * అనంతరం ఆ నెంబర్ ఓపెన్ చేసిన ‘HELP’ అని మెసేజ్ చేయాలి. * దీంతో ‘SUBSUDY/QUOTA/LPGID/BOOK’ ఆప్షన్‌లలో ఏదో ఒకటి ఎంచుకోమని మెసేజ్ వస్తుంది. * గ్యాస్ బుకింగ్ కోసం ‘BOOK’ అని టైప్ చేసి సెండ్ చేయాలి. తర్వాత కన్ఫర్మేషన్ కోసం ‘Y’ అని సెండ్ చేస్తే డెలవరీ అథెంటికేషన్ కోడ్ వస్తుంది. * ఇక సబ్సీడీ వివరాలు తెలుసుకోవాలంటే.. ‘SUBSUDY’ అని కోటా గురించి తెలుసుకోవాలంటే ‘QUOTA’ అని సెండ్ చేస్తే సరిపోతుంది.
వాట్సాప్‌తో ఇండియన్ గ్యాస్ బుకింగ్ ఇలా..
* ఇందుకోసం ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో 7588888824 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. * అనంతరం ఆ నెంబర్ ఓపెన్ చేసిన ‘HELP’ అని మెసేజ్ చేయాలి. * తర్వాత బుకింగ్ కోసం సిలిండర్ రీఫిల్ కోసం ‘REFILL# 17 అంకెల కన్జ్యూమర్ ఐడీ’ని ఎంటర్ చేసి సెండ్ చేయాలి.
వాట్సాప్‌తో భారత్ గ్యాస్ బుకింగ్ ఇలా చేసుకోవాలి…
* ఇందుకోసం ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో 1800224344 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. * అనంతరం సదరు నెంబర్‌ను ఓపెన్ చేసిన ‘1’ లేదా ‘BOOK’ అని మీ రిజిస్టర్ మొబైల్ నుంచి సెండ్ చేస్తే గ్యాస్‌ను బుక్ చేసుకోవచ్చు.
Also Read: మిసెస్ శ్రీలంక విజేతకు ఘోర అవమానం.. అర్హురాలివి కాదంటూ స్టేజ్‌పైనే అలా ప్రవర్తించిన మాజీ రాణీ..
Loan Moratorium: మళ్లీ లోన్ మారటోరియం ఊరట కలిగిస్తారా?.. క్లారిటీ ఇచ్చేసిన ఆర్బీఐ గవర్నర్