మిసెస్ శ్రీలంక విజేతకు ఘోర అవమానం.. అర్హురాలివి కాదంటూ స్టేజ్‏పైనే అలా ప్రవర్తించిన మాజీ రాణీ..

Mrs. Sri Lanka: మిసెస్ శ్రీలంక పోటీ గ్రాండ్ పైనల్‏లో అనుహ్య పరిణామం జరిగింది. ముందుగా ఓ మహిళను విజేతగా ప్రకటించిన కొన్ని క్షణాల్లో ఆమెకు

మిసెస్ శ్రీలంక విజేతకు ఘోర అవమానం.. అర్హురాలివి కాదంటూ స్టేజ్‏పైనే అలా ప్రవర్తించిన మాజీ రాణీ..
Mrs.srilanka
Follow us

|

Updated on: Apr 07, 2021 | 6:48 PM

Mrs. Sri Lanka: మిసెస్ శ్రీలంక పోటీ గ్రాండ్ పైనల్‏లో అనుహ్య పరిణామం జరిగింది. ముందుగా ఓ మహిళను విజేతగా ప్రకటించిన కొన్ని క్షణాల్లో ఆమెకు ఘోర అవమానం జరిగింది. మిసెస్ శ్రీలంక పోటీల్లో విజేతగా నిలిచిన మహిళ ఇందుకు అర్హులు కాదంటూ.. మాజీ మిసెస్ శ్రీలంక ఆమె తలపై ఉన్న కిరీటాన్ని లాగిపడేసింది. ఈ క్రమంలో ఆమె జుట్టు కిరీటానికి పట్టుకున్నా.. అదేం పట్టనట్లుగా తీసి పక్కనే ఉన్న రన్నరప్ తలపై కిరీటాన్ని పెట్టింది. దీంతో తీవ్ర అవమాన భారంతో ఆ మహిళ వేదిక మీది నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై తీవ్ర విచారం చేశారు మిసెస్ శ్రీలంక వరల్డ్ నేషనల్ డైరెక్టర్ చండీమాల్ జయసింఘే. ముందుగా విజేతగా ప్రకటించిన మహిళకే ఈ కిరీటం దక్కుతుందని ప్రకటించారు.

వివరాల్లోకెళితే.. ఆదివారం మిసెస్ శ్రీలంక అందాల పోటీల్లో ఫైనల్ వేడుకలు జరిగాయి. ఇందులో శ్రీమతి పుష్పిక డి సిల్వా అనే మహిళ విజేతగా నిలిచారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఆమె తలపై కిరీటాన్ని అలకరించారు. అనంతరం ఆమె స్టేజ్ పై ర్యాంప్ వాక్ చేసింది. ఇక పక్కనే ఉన్న మాజీ మిసెస్ శ్రీలంక మాట్లాడుతూ.. ఈ కిరీటం కేవలం పెళ్లైనా మహిళలకే వర్తిస్తుందని.. భర్తతో విడాకులు తీసుకున్నవారికి కాదంటూ చెప్పుకోచ్చింది. అనంతరం మిసెస్ శ్రీలంక కిరీటాన్ని ధరించడానికి పుష్పిక డి సిల్వా అర్హురాలు కాదంటూ.. వెంటనే వచ్చి ఆమె తలపై ఉన్న కిరీటాన్ని తీసేసింది. ఆ సమయంలో పుష్పిక జుట్టు కిరీటానికి తగిలిన అదేం పట్టనట్లుగా తీసి పక్కనే ఉన్న రన్న రప్ తలపై కిరీటాన్ని అలకరించింది. దీంతో తీవ్ర అవమానానికి గురైన పుష్పక వేదిక పై నుంచి కిందికి వెళ్లింది.

ఈ విషయంపై పుష్పిక డి సిల్వా సోషల్ మీడియా వేదికాగా స్పందించింది. నేను విడాకులు తీసుకోలేదు. ఒకవేళ నాపై నిందలు వేసిన వారు ఈ విషయాన్ని నిరూపించాలని… విడాకులు పత్రాలు అందరికీ చూపించాలి అంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండా.. తనను అవమానపరిచిన వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు తెలిపింది. ఒక మహిళ కిరీటాన్ని లాక్కునే మరో మహిళ ఎన్నటికీ నిజమైన రాణి అనిపించుకోదు అంటూ కరోలిన్‎ను ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.

ఇక ఈ వివాదంపై అందాలపోటి నిర్వాహకులు స్పందించారు. ముందుగా ప్రకటించినట్లుగా డి సిల్వానే అసలైన విజేత అని మరోసారి స్పష్టం చేశారు. ఆమెకు కిరీటం తిరిగి ఇచ్చేస్తాం. కరోలిన్ ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తున్నాం అని తెలిపారు. ఇదిలా ఉంటే.. మరోసారి కిరీటాన్ని అందుకున్న పుష్పిక డి సిల్వా ఈ గౌరవాన్ని ఒంటరి తల్లులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది.

వీడియో..

Also Read: వామ్మో.. కోహ్లిని అమాంతం ఎత్తిపడేసిన అనుష్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..