వామ్మో.. కోహ్లిని అమాంతం ఎత్తిపడేసిన అనుష్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తమ పర్సనల్ విషయలతోపాటు,

  • Rajitha Chanti
  • Publish Date - 5:02 pm, Wed, 7 April 21
వామ్మో.. కోహ్లిని అమాంతం ఎత్తిపడేసిన అనుష్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Anushka Sharma Virat

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తమ పర్సనల్ విషయలతోపాటు, కెరీర్‏కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్‏లో ఉంటుంది ఈ జంట. అటు ఎవరి వృత్తిలో వారు బిజీగా ఉన్నా.. వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక వీరిద్దరికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో విరాట్‏ను అనుష్క అమాంతం ఎత్తుకుంది. (Anushka Virat)

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2021 రోజున అనుష్క తన భర్త కోహ్లీని ఎవరి సహయం లేకుండా అమాంతం పైకి ఎత్తేసింది. ఓ యాడ్ షూట్ చేస్తు్న్న సమయంలో అనుష్క వెనక నుంచి కోహ్లిని గట్టిగా పట్టుకోని పైకి ఎత్తేసింది. దీంతో కోహ్లి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెంటనే.. హే నిజంగానే నువ్వు నన్ను ఎత్తుకున్నావా ? మళ్లీ చేసి చూపించు అంటూ అడగడంతో.. అనుష్క మళ్లీ చేసింది. నువ్వు నాకు సహయం చేయకూడదు అంటూ తానే స్వయంగా విరాట్‏ను ఎత్తుకుంది. ఈ వీడియోను అనుష్క తన ఇన్‏స్టాగ్రామ్‏లో షేర్ చేసుకుంది. ఇది చూసిన నెటిజన్లు.. సూపర్ అనుష్క.. వామిక మామ్ ఈజ్ స్ట్రాంగ్, శక్తీమాన్ అల్ట్రా ప్రో మ్యాక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. విరుష్క జంట ఈ ఏడాది జనవరి 11న ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వారి పాపకు వామిక (Vamika) అనే నామకరణం చేశారు. వీరి పాపకు సంబంధించిన కొన్ని ఫోటోలను విరుష్క జంట సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్ 2021 టోర్నితో బిజీగా ఉన్నాడు. అలాగే అనుష్క కూడా తన సినిమాలపై దృష్టి పెట్టింది.

ట్వీట్..

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

Also Read: మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు ‘పుష్ప’రాజ్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..

వాళ్ళతో ఫైట్ చేసేంత ఓపిక.. డబ్బు.. టైం కూడా లేదు.. ఏ ఒక్కటి ఉన్న ఫైట్ చేస్తా.. ‘పక్కింటి కుర్రాడి’ మాటలు..