AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Connection: ఇల్లు మారుతున్నారా..? గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవడం చాలా ఈజీ.. ఇలా చేస్తే నిమిషాల్లోనే అప్డేట్..

పట్టణాలు, సిటీలలో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో ఉంటారు. వివిధ కారణాలతో తరచుగా ఇళ్లు మారుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ కొత్త ఇంటికి గ్యాస్ డెలివరీ అవుతుంది. ఇది ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

Gas Connection: ఇల్లు మారుతున్నారా..? గ్యాస్ కనెక్షన్ అడ్రస్ మార్చుకోవడం చాలా ఈజీ.. ఇలా చేస్తే నిమిషాల్లోనే అప్డేట్..
Gas Connection
Venkatrao Lella
|

Updated on: Sep 11, 2026 | 12:18 PM

Share

నగరాలు, పట్టణాల్లో ఎక్కువమంది అద్దె ఇళ్లల్లో ఉంటారు. ఉద్యోగాలు మారినప్పుడు లేదా ఇతర కారణాలతో ఇల్లు మారడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మీ అడ్రస్ కూడా మారుతుంది. దీంతో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఆధార్‌తో పాటు ఇతర గుర్తింపు ధృవీకరణ పత్రాల్లో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలి. అలాగే గ్యాస్ కనెక్షన్‌కు సంబంధించి కూడా మీ అడ్రస్ మార్చుకోవడం తప్పనిసరి. కొత్త కనెక్షన్ తీసుకోవడానికి బదులుగా ఇప్పటికే ఉన్న కనెక్షన్‌కు ఇంటి చిరునామా అప్డేట్ చేసుకోవచ్చు. దీని వల్ల గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే ఆధార్ మార్చుకోకుండా గ్యాస్ బుకింగ్ చేస్తే పాత అడ్రస్‌కు డెలివరీ అవుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అడ్రస్ అప్డేట్ చేసుకోవడం అనేది తప్పనిసరి. దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి..? అప్డేట్ చేసుకోవడం ఎలా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం

ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్ ప్రూఫ్, గ్యాస్ బుక్, సబ్‌స్క్రిప్షన్ వోచర్, కేవైసీ డాక్యుమెంట్స్

ఎల్పీజీ కనెక్షన్ వేరే అడ్రస్‌కు మార్చుకోవడం ఎలా..?

ప్రస్తుతం మీకు గ్యాస్ పంపిణీ చేస్తున్న ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ట్రాన్స్‌ఫర్ టెర్మినేషన్ వోచర్ (TTV) అడిగి తీసుకోవాలి. మీరు గ్యాస్ కనెక్షన్‌ను వేరే ఏరియాకు మార్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. అనంతరం మీ కొత్త అడ్రస్‌లో గ్యాస్ పంపిణీ చేస్తున్న ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లాలి. ట్రాన్స్‌ఫర్ టెర్మినేషన్ వోచర్ వారికి అందించాలి. అనంతరం కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. మీ కొత్త అడ్రస్‌కు సంబంధించి ఏదైనా ప్రూఫ్ అందించాలి. కరెంట్ బిల్లు, రెంటర్ అగ్రిమెంట్ లాంటివి సమర్పించాలి. అనంతరం మీ అడ్రస్ అప్డేట్ చేస్తారు. ఈ ప్రాసెస్ నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతుంది. అనంతరం మీరు ఎప్పుడైనా గ్యాస్ బుకింగ్ చేసుకుంటే అప్డేట్ అయిన అడ్రస్‌కు అందుతుంది.

వేరే నగరానికి వెళుతుంటే ఎలా మార్చుకోవాలి..?

ఒకవేళ మీరు వేరేనగరానికి వెళుతుంటే.. మీ సిలిండర్, ప్రెషర్ రెగ్యూలేటర్ ప్రస్తుత ఏజెన్సీకి తిరిగి ఇవ్వాలి. అనంతరం ఏజెన్సీ నిర్వహకులు టెర్మినేషన్ వోచర్ జారీ చేస్తారు. అలాగే సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా తిరిగి ఇచ్చేస్తారు. అనంతరం మీ కొత్త అడ్రస్‌లో ఎల్పీజీ గ్యాస్ పంపిణీ చేస్తున్న ఏజెన్సీని సంప్రదించాలి. టెర్మినేషన్ వోచర్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాలి. అనంతరం మీ గ్యాస్ కనెక్షన్‌లో అడ్రస్ అప్డేట్ చేస్తారు.

పీఎన్జీలోకి మారడం ఎలా..?

పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే ముందుగా మీ ఎల్పీజీ కనెక్షన్ వదలుకోవాలి. ఇందుకోసం మీ సిలిండర్లను సరెండర్ చేసి గ్యాస్ కనెక్షన్ రద్దు చేయించుకోవాలి. అనంతరం మీ ప్రాంతంలో పీఎన్జీ సరఫరా చేస్తున్న ఏజెన్సీని సంప్రదించాలి.

Follow Us