Gas Cylinder: గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు మరో షాక్.. బుక్ చేశాక ఈ మెస్సేజ్ వచ్చిందా..?
గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు షాకింగ్ న్యూస్. గ్యాస్ డెలివరీల్లో జాప్యం జరుగుతోంది. దీంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసిన తర్వాత డెలివరీకి 10 రోజుల సమయం పడుతుంది. డెలివరీ ఆలస్యం అవుతుందంటూ కంపెనీలు ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపుతున్నాయి.

దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కష్టాలు తప్పడం లేదు. సిలిండర్ బుక్ చేసిన తర్వాత వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ చేస్తామని కంపెనీలు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నాయి. కానీ వారం పూర్తయిన తర్వాత కూడా సిలిండర్ డెలివరీ చేయడం లేదు. మరో వారం రోజుల సమయం పడుతుందని, అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ కంపెనీలు వినియోగదారులకు మెస్సేజ్‌లు పంపుతున్నాయి. అంటే గ్యాస్ సిలిండర్ కోసం 10 రోజులు వరకు ఆగాల్సి వస్తోంది. దీంతో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుక్ చేసిన తర్వాత అందుకునేందుకు చాలా సమయం పడుతుంది. దీంతో గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
గ్యాస్ సిలిండర్ ధర ఎంతంటే..?
గ్యాస్ కొరత లేదని ప్రభుత్వాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం వేరేలా ఉన్నాయి. గ్యాస్ డెలివరీల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం డొమెసిక్ట్ గ్యాస్ సిలిండర్ ధర రూ.965గా ఉండగా.. డెలివరీ ఛార్జీలు కలుపుకుంటే రూ.వెయ్యి వరకు చెల్లించాల్సి వస్తోంది. అటు గ్యాస్ బుకింగ్‌పై కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గ్యాస్ బుకింగ్స్‌కు వెయిటింగ్ పీరియడ్ విధించింది. పట్టణాల్లో ఒక గ్యాస్ బుక్ చేసిన తర్వాత 25 రోజులకు మరో గ్యాస్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక గ్రామాల్లో 45 రోజుల వెయిటింగ్ పీరియడ్ కేంద్రం విధించింది. గ్యాస్ కొరత క్రమంలో కేంద్ర ప్రభుత్వం మార్చిలో ఈ నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇప్పటికీ ఇవి అలాగే కొనసాగుతున్నాయి.
పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు
అటు ఈ నెల 1వ తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. 19 కిలోల గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ.994 పెరిగింది. దీంతో ప్రస్తుతం దాని ధర రూ.3,315కి చేరుకుంది. ఇక 5 కిలోల సిలిండర్ ధర రూ.357గా ఉండగా.. 47.5 కిలోల సిలిండర్ ధర రూ.2484 పెరగ్గా.. రూ.8,282గా ఉంది. ఇక ఫిబ్రవరిలో డొమెసిక్ట్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.905గా ఉండగా.. మార్చిలో రూ.60 పెరిగింది. దీంతో ప్రస్తుతం రూ.965 వద్ద స్థిరపడింది. ప్రతీ నెలా ఒకటో తేదీన కొత్త గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి. గత రెండు నెలలుగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. జూన్ 1వ తేదీన కొత్త ధరలను కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. దీంతో వచ్చే నెల 1న ధరలను పెంచుతారా.. లేదా స్థిరంగా ఉంచుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఇంకా ద్దుమణగలేదు. దీంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది.
