AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Loans: బ్యాంకు లోన్‌తో కారు కొనాలనుకుంటున్నారా? వడ్డీ రేట్లు చెక్ చేసుకోండి

కారు కొనడం చాలామందికి ఒక కల. ఇటీవల కాలంలో కారు కొనాలనే ఆలోచన చాలామందిలో మొదలైంది. కారు కొనడం కోసం లోన్ కోసం ప్రయత్నిస్తున్నట్టయితే.. బ్యాంకులు కారు లోన్లపై విధిస్తున్న వడ్డీరేట్లు ఎలా ఉన్నాయో పరిశీలించండి.

Car Loans: బ్యాంకు లోన్‌తో కారు కొనాలనుకుంటున్నారా? వడ్డీ రేట్లు చెక్ చేసుకోండి
Car Loan Interest Rate
KVD Varma
|

Updated on: Sep 24, 2021 | 6:57 PM

Share

Car Loans: కారు కొనడం చాలామందికి ఒక కల. ఇటీవల కాలంలో కారు కొనాలనే ఆలోచన చాలామందిలో మొదలైంది. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో కుటుంబం అంతా బయటకు వెళ్ళాలంటే.. ప్రత్యేకంగా సొంత వాహనం ఉంటేనే మంచిదనే భావన పెరిగిపోయింది. దీంతో చాలామంది కారు కొనడం కోసం ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలో కారు కొనడం కోసం రుణం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కార్ల షోరూంలు కూడా తమ వద్దకు కారు కొనుగోలు చేయడానికి వచ్చేవారికి బ్యాంకు రుణాలను ఇప్పించడం కోసం తమ వంతు సహాయం చేస్తున్నాయి. అయితే, కారు కొనడం కోసం లోన్ తీసుకోవడం కోసం చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కారు కొత్త కారు అయినా.. సెకండ్ హ్యాండ్ అయినా సరే.. కారు కొనే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్టే.. లోన్ తీసుకునే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వె

హికల్ లోన్ అనేది.. ప్రధానంగా వాహనం కొనాలనుకుంటున్న వారి క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇస్తాయి బ్యాంకులు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి లోన్ సొమ్ము విషయంలో అధిక ప్రయోజనం ఉంటుంది. అంటే, క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే మీకు 90 శాతం వరకూ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రీపెమేంట్ చేయగలిగే సామర్ధ్యాన్నీ లెక్క వేస్తాయి రుణ సంస్థలు. మీరు జాబ్ చేస్తున్నట్టయితే.. మీకు వచ్చే జీతం విషయంలో.. మీకు ఉన్న ఖర్చులు.. మీరు లోన్ ఈఏంఐ కట్టగలిగే విధంగా సహకరిస్తాయా అనేదీ బ్యాంకులు అంచనా వేస్తాయి. ఇలా వీటన్నిటి ఆధారంగా లోన్ ఇస్తాయి బ్యాంకులు.

అయితే, మీరు లోన్ తీసుకునే ముందు కచ్చితంగా బేరీజు వేసుకోవాల్సింది వడ్డీరేటు. మీరు లోన్ తీసుకున్న సొమ్ముపై బ్యాంకులు విధించే వడ్డీరేటు అధికంగా ఉంటె దాని వలన మీరు కారు కొన్న ప్రయోజనం దక్కకపోవచ్చు. అందుకే లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకు ఎంత వడ్డీరేటు విధిస్తుంది అనేది కచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఆ తరువాతే లోన్ కోసం వెళ్ళాలి. ముందే చెప్పినట్టు మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు లోన్ ఇస్తాయి.. అదేవిధంగా మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే వడ్డీరేట్లు కూడా మారుతూ ఉంటాయి.

ఇక్కడ వివిధ బ్యాంకులు వాహన రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లతో పాటు.. ఒక లక్షరూపాయల లోన్ తీసుకుంటే.. ఐదు సంవత్సరాల కాల వ్యవధికి ఎంత ఈఏంఐ కట్టాల్సి వస్తుంది అనేదానిని మీ సౌలభ్యం కోసం అందిస్తున్నాం. దీనిని చెక్ చేసుకోండి.

Car Loan Rates

Car Loan Rates

కారు రుణాలు సాధారణంగా మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు ఉంటాయి. కానీ కొంతమంది రుణదాతలు ఏడు సంవత్సరాల వరకు రుణాలు అందించవచ్చు. ఎక్కువ కాలం రుణం అంటే చిన్న సమానమైన నెలవారీ వాయిదాలు (EMI లు) కావచ్చు. ఇది కారు మరింత సరసమైనదిగా అనిపిస్తుంది. కానీ మొత్తంమీద, మీరు ఎక్కువ వడ్డీని చెల్లిస్తారు.

కారు విలువ తగ్గించే ఆస్తి అని మర్చిపోవద్దు. కాబట్టి పెద్ద రుణం తీసుకోవడం ఉత్తమమైన పని కాకపోవచ్చు. కానీ మీరు స్వల్ప వ్యవధిలో కారు రుణం తీసుకుంటే, EMI లు భారీగా ఉంటాయి. ఒకవేళ మీరు చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కుంటే.. దానితో మీ క్రెడిట్ రిపోర్టుపై మచ్చ ఏర్పడుతుంది.

Also Read: Electric Vehicle Charging: ప్రపంచంలో ఎత్తైన ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసా..?

Dairy Farming: పాడి రైతులకు గమనిక..! ఈ 5 పద్దతులు పాటిస్తే ఆదాయం రెట్టింపు..