LML Electric Scooter: దేశీయ మార్కెట్‌లోకి ఎల్ఎంఎల్ రీ ఎంట్రీ.. జీరో డౌన్ పేపెంట్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లండి..
ఎలక్ట్రిక్ వేరియంట్లో ఎల్ఎంఎల్(LML) నుంచి సరికొత్త బైక్ ఆవిష్కరణకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన మోడల్ ను ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించింది. ఎల్ఎంఎల్ స్టార్ పేరుతో విడుదల చేసిన ఈ మోడల్ ఫ్రెష్ లుక్ తో పాటు అత్యాధునిక ఫీచర్స్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో ఆకట్టుకుంటోంది.

ఎల్ఎంఎల్(LML) ఈ పేరు గుర్తుందా.. ఒకప్పుడు బైక్ అంటే బజాజ్ చేతక్, ఎల్ఎంఎల్ .. ఈ రెండే ఉండేవి. అయితే కాలానుగుణంగా.. కొత్త ఆవిష్కరణలు అందుకోలేక ఆ కంపెనీ పేరు కనుమరుగైంది. అయితే మళ్లీ ఎల్ఎంఎల్ కంపెనీ బండ్లు భారతీయ రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి. ఎలక్ట్రిక్ వేరియంట్లో ఎల్ఎంఎల్(LML) నుంచి సరికొత్త బైక్ ఆవిష్కరణకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన మోడల్ ను ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించింది. ఎల్ఎంఎల్ స్టార్ పేరుతో విడుదల చేసిన ఈ మోడల్ ఫ్రెష్ లుక్ తో పాటు అత్యాధునిక ఫీచర్స్, శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ తో ఆకట్టుకుంటోంది. జీరో డౌన్ పేమెంట్ తో బుకింగ్స్ కూడా ప్రారంభమైన ఈ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎలా ఉందంటే..
కొత్త ఎల్ఎంఎల్ స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఆకర్షిస్తోంది. స్కూటర్ సెగ్మెంట్‌లో సాధారణంగా కనిపించే అనేక ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్‌ను ఇటలీలో రూపొందించామని, ముందు భాగంలో ఎల్‌ఈడీ పగటిపూట రన్నింగ్ లైట్లతో పాటు 360-డిగ్రీ కెమెరాతో తయారు చేశామని ఆ కంపెనీ తెలిపింది. ఇందులో ఇచ్చిన కెమెరా స్కూటర్‌కు బ్లాక్ బాక్స్‌లా పనిచేస్తుందని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందు, వెనుక జరిగే కార్యకలాపాలను రికార్డు చేస్తుందని కంపెనీ చెబుతోంది. యాంబియంట్ లైటింగ్, ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్ , బ్యాక్ లైట్, ఇండికేటర్‌లు ఉన్నాయి.
భద్రత కోసం..
ఎల్ఎంఎల్ స్టార్ స్కూటర్‌లో ఏబీఎస్, రివర్స్ పార్క్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి పీచర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ లో శక్తివంతమైన మోటారు, బ్యాటరీ ఉంది. సీటు కింద మీకు తగినంత స్టోరేజ్ స్థలాన్నిఇస్తుంది. రెండు ఫుల్ ఫేస్ హెల్మెట్‌లను సీటు కింద ఉంచుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
లాంచింగ్ ఎప్పుడు..
ఈ ఏడాది సెప్టెంబర్ నెల నాటికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వినియోగదారులకు అందించే అవకాశం ఉంది. స్కూటర్ ధర, డ్రైవింగ్ రేంజ్ వంటివి ఇంకా ప్రకటించలేదు. ఈ సందర్భంగా ఎల్‌ఎమ్‌ఎల్ ఎమోషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ భాటియా మాట్లాడుతూ, తాము మరోసారి స్కూటర్ రంగంలోకి ప్రవేశిస్తున్నామని, ఈసారి వినియోగదారులకు ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్ రూపంలో వస్తున్నామని చెప్పారు. ఇది పరిశ్రమలో అత్యుత్తమ డ్రైవింగ్ శ్రేణిని ఇస్తుందని, దీని ధరను సరసమైనదిగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని భాటియా చెప్పారు.
బుకింగ్స్ ప్రారంభం..
జీరో డౌన్ పేమెంట్ తోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసుకోవచ్చు. దీనికోసం కంపెనీ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఓ ఫారం నింపాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..