AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life insurance policy: జీవిత బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా.. ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

భవిష్యత్తు భద్రత కోసం చాలా మంది జీవిత బీమా పాలసీలను ఎంచుకుంటారు. మనకు వచ్చే ఆదాయం, వయసు, భవిష్యత్తు ఆలోచన ఆధారంగా కవరేజీని ఎంచుకోవల్సి ఉంటుంది. బీమా చేసే వ్యక్తి ఎంచుకున్న ప్రీమియం..

Life insurance policy: జీవిత బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా.. ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..
Life Insurance Policy (Representative Image)
Amarnadh Daneti
|

Updated on: Nov 14, 2022 | 6:31 PM

Share

భవిష్యత్తు భద్రత కోసం చాలా మంది జీవిత బీమా పాలసీలను ఎంచుకుంటారు. మనకు వచ్చే ఆదాయం, వయసు, భవిష్యత్తు ఆలోచన ఆధారంగా కవరేజీని ఎంచుకోవల్సి ఉంటుంది. బీమా చేసే వ్యక్తి ఎంచుకున్న ప్రీమియం చెల్లించడానికి భారం కాకుండా ఉండేలా ఉంటే ఆ వ్యక్తి పూర్తికాలం పాలసీని కొనసాగించే అవకాశం ఉంటుంది. స్థోమతకు మించి ప్రీమియాన్ని ఎంచుకున్నట్లయితే పూర్తికాలం చెల్లించలేక, మధ్యలోనే పాలసీని ఆపేసే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే పాలసీని ఎంచుకునేటప్పుడు అన్ని విషయాలను ఆలోచించుకోవాలి. బీమా చేసే వ్యక్తి ఎంచుకున్న కవరేజీ, కాలపరిమితి ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియాన్ని లెక్కిస్తారు. జీవిత బీమా అనేది బీమా సంస్థ, పాలసీ తీసుకునే వ్యక్తి మధ్య జరిగే ఒప్పందం. వ్యక్తి జీవితకాలంలో పాలసీదారు చెల్లించిన ప్రీమియానికి బదులుగా బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు నామినీకి బీమా కవరేజీని చెల్లించడానికి సంస్థ హామీ ఇస్తుంది. పాలసీ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దరఖాస్తులో బీమా చేసే వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను తప్పనిసరిగా తెలియజేయాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే ముందుగానే దరఖాస్తులో తెలియజేయాలి. వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితి, వయస్సు ఆధారంగా అనేక రకమైన పాలసీలు అందుబాటులో ఉన్నాయి. పాలసీ చేసే వ్యక్తి అవసరాలకు అనుగుణంగా దీర్ఘ కాలిక పాలసీని ఎంచుకోవాలా, స్వల్ప కాలపరిమితిలో పాలసీని ఎంచుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి.పాలసీ తీసుకునే వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

లక్ష్యం స్పష్టంగా ఉండాలి

పాలసీ తీసుకునేటప్పుడు ఏ అవసరాల కోసం తీసుకుంటున్నామో స్పష్టత ఉండాలి. కుటుంబ ఆర్థిక భద్రతను కాపాడటం వ్యక్తి యొక్క ప్రాథమిక లక్ష్యం అయితే.. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది.

బీమా కవరేజి

వ్యక్తి ఎంచుకున్న పాలసీ కవరేజ్ ఎంత అనేదానిపై ప్రీమియం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా వార్షిక ఆదాయానికి కనీసం పది రెట్లు జీవిత బీమా కవరేజిని కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి

పాలసీ యొక్క కాలపరిమితి

జీవిత బీమా పాలసీ యొక్క కాలపరిమితిని ఎంచుకోవడం చాల ఆముఖ్యం. పదవీ విరమణ వయస్సులోంచి ప్రస్తుత బీమా చేసే వ్యక్తి వయసను ను తీసివేయాలి. ఉదాహరణకు ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు అనుకోండి.. 60 ఏళ్లకు పదవీ విరమణ చేయాలనుకుంటే పాలసీ వ్యవధిని 60-30= 30 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఉండేలా ఎంచుకోవాలి.

అదనపు ప్రయెజనాలు

జీవిత బీమా పాలసీతో పాటు అదనపు రుసుము చెల్లించి క్రిటికల్ ఇల్నల్ రైడర్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ వంటివాటిని యాడ్ చేసుకోవచ్చు. నామమాత్రపు ప్రీమియంలను చెల్లించడం ద్వారా వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

వాస్తవాలను దాచవద్దు

పొగాకు లేదా ఆల్కహాల్ తీసుకుంటే, లేదా ప్రమాదకర పరిశ్రమలో పని చేస్తే, ఈ వివరాల గురించి జీవిత బీమా సంస్థకు పాలసీ తీసుకునే ముందే తెలియజేయాలి. పాలసీ తీసుకునే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా ముందే తెలియజేయాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలను తెలియజేయాలి. ముందే వాస్తవాలు తెలియజేయకపోతే.. బీమా క్లెయిమ్‌లో ఇబ్బందులు పడే అవకాశం ఉండొచ్చు.

నిబంధనలు జాగ్రత్తగా చదవండి

పాలసీ తీసుకునేటప్పుడు షరతులను తప్పనిసరిగా చదవాలి. అన్ని విషయాలు ముందుగానే తెలుసుకోవాలి.

చిన్న వయస్సులోనే పాలసీ తీసుకోండి

చిన్న వయస్సులో ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే చెల్లించాల్సిన ప్రీమియంలు తక్కువగా ఉంటాయి. అందువల్ల, మీరు సంపాదించడం ప్రారంభించిన వెంటనే మీ జీవిత బీమా పాలసీని కొనుగోలు చేస్తే ప్రీమియం భారంగా అనిపించదు.

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం చూడండి..

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా