LIC Scholarship: విద్యార్థులకు ఎల్‌ఐసీ నుంచి స్కాలర్‌షిప్.. ఎవరు అర్హులు..!
గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగంలో), ఇంటిగ్రేటెడ్ కోర్సు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సు (ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల/ఇన్‌స్టిట్యూట్ లేదా ఇండస్ట్రియల్..
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద విద్యార్థులకు చదువుల కోసం రూ. 15,000 నుండి రూ. 40,000 వరకు సహాయం అందిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చదువులో సహాయం చేయడమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 22. మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే వివరాలు తెలుసుకోండి.
ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు అర్హత ఏమిటి?
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల కోసం ఈ స్కాలర్‌షిప్ పథకం. 2021-22, 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులు లేదా 10వ/12వ/డిప్లొమాలో CGPA లేదా 2023-24, 2024-లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఈ పథకం భారతదేశం అంతటా అందుబాటులో ఉందని ఎల్‌ఐసీ తెలిపింది. రెండు వేర్వేరు కేటగిరీలలో అందుబాటులో ఉండనుంది.
సాధారణ స్కాలర్‌షిప్:
మెడిసిన్ (MBBS, BAMS, BHMS, BDS) విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు సంవత్సరానికి రూ. 40,000 అందిస్తుంది. ఇది కోర్సు వ్యవధిలో ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున రెండు విడతలుగా అందిస్తుంది.
ఇంజినీరింగ్ (బీఈ, బీటెక్, బార్చ్)లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఏడాదికి రూ.30 వేలు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రెండు విడతలుగా అందజేస్తారు.
గ్రాడ్యుయేషన్ (ఏదైనా విభాగంలో), ఇంటిగ్రేటెడ్ కోర్సు, డిప్లొమా, ఒకేషనల్ కోర్సు (ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల/ఇన్‌స్టిట్యూట్ లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-ఐటీఐ)లో చదువుతున్న విద్యార్థులకు సంవత్సరానికి రూ. 20,000 అందజేస్తారు. దీనిని రెండు వాయిదాలుగా అందిస్తుంది. ఒక్కొక్కరికి 10,000 అందిస్తారు.
ప్రత్యేక స్కాలర్‌షిప్ (అమ్మాయి)
10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్/10+2 ప్యాటర్న్ లేదా వొకేషనల్/డిప్లొమా కోర్సు (ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల/ఇనిస్టిట్యూట్ లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-ఐటీఐ)లో రెండేళ్లపాటు చదువుతున్న బాలికలకు సంవత్సరానికి రూ.15,000 ఇస్తారు. రెండు రూ.7,500 విడతల వారీగా అందుతుంది.
ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్‌లో రూ.6000 నుంచి రూ.12000కి పెంచనున్నారా?
ఎలా దరఖాస్తు చేయాలి?
- విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది.
- మీరు ఎల్‌ఐసీ వెబ్‌సైట్ www.licindia.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి ఇచ్చిన ఇమెయిల్ IDకి ఆమోదం పొందినట్లు మెయిల్ అందుతుంది.
- మరింత సమాచారం ఆ డివిజనల్ కార్యాలయం ద్వారా అంగీకార మెయిల్ అందుతుంది.
- అభ్యర్థి సరైన ఇమెయిల్ ID, సంప్రదింపు నంబర్ అందించాలి.
- స్కాలర్‌షిప్ మొత్తం NEFT ద్వారా ఎంపికైన విద్యార్థి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తారు.
- నగదు బదిలీ చేయబడే బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా యాక్టివ్‌గా ఉండాలని గుర్తించుకోండి.
ఇది కూడా చదవండి: Financial Deadlines: ఈ ఏడాది ముగిసే లోపు ఈ పనులు పూర్తి చేసుకోండి.. లేకుంటే పెనాల్టీ తప్పదు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి