
సాధారణంగా ఏదైనా పార్శిల్ లేటు అయిందంటే.. మహా అయితే నాలుగైదు రోజులకు ఇంటికొస్తుంది. లేదా అది కాస్తా క్యాన్సిల్ అవుతుంది. ఒకప్పుడు నోకియా ఫోన్లంటే పెద్ద బ్రాండ్. ఎవరి చేతిలో చూసినా ఎక్కువగా నోకియా కీప్యాడ్ ఫోన్లు కనిపించేవి. సెల్‌ఫోన్లు వచ్చిన కొత్తలో నోకియా బ్రాండ్‌కు చెందిన మోడళ్లు మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. మరి అలాంటి నోకియా ఫోన్లకు ఉన్న క్రేజే బట్టి 2010లో వాటిని ఆర్డర్ పెట్టిన ఓ ట్రేడర్‌కి 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పొందాయి. ఆ ఫోన్ల ప్యాకింగ్‌లను అతడు ఓపెన్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇది చదవండి: ట్రాఫిక్ తప్పించుకోవాలా.? హైదరాబాద్ టూ విజయవాడ ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లండి.!
వివరాల్లోకి వెళ్తే.. లిబియాలో అంతర్యుద్ధం కారణంగా 16 ఏళ్ల పాటు నిలిచిపోయిన నోకియా ఫోన్ల షిప్మెంట్ ఎట్టకేలకు రాజధాని ట్రిపోలిలో ఓ ట్రేడర్ చేతుల్లోకి వచ్చింది. 2010లో ఆర్డర్ చేసిన ఆ ఫోన్ల బాక్సులను ఓపెన్ చేస్తూ అతడు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ పాత ఫోన్ బాక్సులను ఓపెన్ చేశాడు. ఒకప్పుడు అత్యంత పాపులర్ అయిన నోకియా కీప్యాడ్ ఫోన్లు, మ్యూజిక్ ఎడిషన్ మోడల్స్, అప్పట్లో ధనవంతులు వాడే కమ్యూనికేటర్ హ్యాండ్ సెట్లను చూసి వారు నవ్వు ఆపుకోలేకపోయారు. వీటిని ఫోన్లు అంటారా? లేక పురాతన కళాఖండాలా అంటూ అతడు జోక్ చేశారు.
ఆ నోకియా ఫోన్లను పంపించిన వ్యక్తి.. వాటిని అందుకునే ట్రేడర్ ఇద్దరూ లిబియా రాజధాని ట్రిపోలిలోనే ఉంటున్నారట. కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వారు నివసిస్తుండగా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏకంగా 16 ఏళ్ల సమయం పట్టింది. లిబియాలో యుద్ధం కారణంగా ఈ సెల్ ఫోన్ల షిప్మెంట్ వేర్ హౌస్‌లోనే ఉండిపోయింది. ఈ ఫోన్ల బాక్సులను చూస్తూ ఆ ట్రేడర్ ఫ్రెండ్ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. 16 ఏళ్ల క్రితం ఈ ఫోన్ల విలువతో ఒక పెద్ద ఇల్లు కొనుక్కునే వాళ్లమని, కానీ ఇప్పుడు వీటికి ఎలాంటి విలువ లేదని వాపోయారు. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.
🚨⚡️UNUSUAL
After a 16-year wait due to the war, a Libyan trader in Tripoli finally receives a shipment of Nokia phones he ordered in 2010!
Upon opening the boxes, he joked, “Are these phones or artifacts?”
A unique story highlighting the tragedies of war and the destruction… pic.twitter.com/KVOXWJJ1u5
— RussiaNews 🇷🇺 (@mog_russEN) January 8, 2026
ఇది చదవండి: బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించింది.. కానీ చిరంజీవితో మాత్రం.! కారణం చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి