Lectrix EV: దేశంలో చీపెస్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇదే.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ.

ప్రముఖ ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్‌ ఈవీ సంస్థ అనువైన బడ్జెట్లో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ఈ2డబ్ల్యూని లాంచ్‌ చేసింది. దీనిలో ప్రధాన ఆకర్షణ దాని లుక్‌తో పాటు ఫీచర్లు. ప్రస్తుతంఈ స్కూటర్‌ను లెక్ట్రిక్స్‌ ఈవీ సంస్థ రూ. 49,999 ఎక్స్‌ షోరూంకు విక్రయిస్తోంది. దీనిలో మరో కొత్త అంశం ఏమిటంటే ఈ బైక్‌తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

Lectrix EV: దేశంలో చీపెస్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇదే.. సింగిల్‌ చార్జ్‌పై 100కి.మీ.
Lectrix Ev E2w
Follow us
Madhu

|

Updated on: Apr 10, 2024 | 6:34 AM

ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు జనాల దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎక్కువ సంఖ్యలో వాటినే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే వినియోగదారులకు ప్రధాన ఇబ్బంది వాటి ధర. రూ. లక్షకు పైగానే ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధరలు ఉన్నాయి. అయితే ప్రముఖ ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్‌ ఈవీ సంస్థ అనువైన బడ్జెట్లో హై స్పీడ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ఈ2డబ్ల్యూని లాంచ్‌ చేసింది. దీనిలో ప్రధాన ఆకర్షణ దాని లుక్‌తో పాటు ఫీచర్లు. ప్రస్తుతంఈ స్కూటర్‌ను లెక్ట్రిక్స్‌ ఈవీ సంస్థ రూ. 49,999 ఎక్స్‌ షోరూంకు విక్రయిస్తోంది. దీనిలో మరో కొత్త అంశం ఏమిటంటే ఈ బైక్‌తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని కూడా సర్వీస్‌లాగానే కంపెనీ వినియోగదారులకు అందిస్తుంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

కొత్త యాజమాన్య విధానం..

లెక్ట్రిక్స్‌ ఈవీ ఈ2డబ్ల్యూ వినూత్నమైన యాజమాన్య మోడల్‌ని భారతీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. దాని పేరు బ్యాటరీ-ఆస్-ఏ సర్వీస్ (బీఏఏఎస్) ప్రోగ్రామ్. సాధారణంగా మీరు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేస్తేఏ బ్యాటరీ అంతర్భాగంగా ఉంటుంది. అయితే దీనిలో అలా ఉండదు. వినియోగదారులను విడిగా బ్యాటరీకి సబ్‌స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వినియోగదారులకు ప్రారంభ పెట్టుబడిని తగ్గించడమే కాకుండా.. బ్యాటరీ అధిక లైఫ్‌ ఉండటానికి, రీప్లేస్‌మెంట్ ఖర్చులకు సంబంధించిన ఆందోళనలను కూడా తొలగిస్తుంది. ఈ బ్యాటరీ జీవితకాల వారంటీతో వస్తుంది.

చాలా ఎకనామికల్‌..

ఈ స్కూటర్‌ లాంచ్‌ సందర్భంగా లెక్ట్రిక్స్‌ ఈవీ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ ప్రతీశ్‌ తల్వార్‌ మాట్లాడుతూ ఈమ బ్యాటరీ సర్వీస్‌ విధానం చాలా సింపుల్‌ గా ఉంటుందన్నారు. కానీ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెప్పారు. బ్యాటరీని వాహనం నుంచి వేరు చేసి.. ప్రత్యేకమైన సర్వీస్‌గా అందిస్తామని ఆయన వివరించారు. దీని వల్ల వినియోగదారులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. బ్యాటరీ వ్యవహారంలో అనిశ్చితి, దాని అధిక ధరను తగ్గిస్తుందన్నారు. అంతేకాక ప్రస్తుత మార్కెట్లో ఓ సంప్రదాయ పెట్రోల్‌ ఇంజిన్‌ ద్విచక్రవాహనం కొనుగోలు చేయాలంటే కనీసం రూ. లక్షపెట్టాల్సిందేనని, అయితే తమ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని కేవలం రూ. 49,999‍కే అందిస్తున్నామన్నారు. తమ సబ్‌ స్క్రిప్షన్‌ ప్లాన్‌లో స్కూటర్‌ కొనడం వల్ల సగం ధరకే బండి రావడంతో పాటు ప్రతి నెలా పెట్రోల్‌ ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు.

ఇవి కూడా చదవండి

లెక్ట్రిక్స్‌ ఈవీ ప్రత్యేకతలు ఇవే..

ఈ స్కూటర్‌ని ఒక్కసారి చార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ ప రకటించింది. దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు ఉంటుంది. బ్యాటరీకి లైఫ్‌ టైం వారెంటీ వస్తుంది. బ్యాటరీ ఆన్‌ ఏ సర్వీస్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విక్రయిస్తున్న తమ లెక్ట్రిక్స్‌ ఈవీ కొత్త స్కూటర్‌ ధర 40శాతం తక్కువని సంస్థ చెబుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..