AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget: గత మధ్యంతర బడ్జెట్-2019లో ఈ 2 కొత్త పథకాలు హైలైట్ అయ్యాయి

సాధారణ బడ్జెట్ లాగే ప్రభుత్వ ఆదాయ, వ్యయాల జాబితా మధ్యంతర బడ్జెట్ లో ఉంటుంది. చిన్న పన్ను మార్పులు, కొత్త పథకాలు మొదలైనవి ఉండవచ్చు. ఫిబ్రవరి 1, 2019న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇతర కారణాల వల్ల లేకపోవడంతో పీయూష్ గోయల్ ఆ రోజు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తన బడ్జెట్‌లో..

Budget: గత మధ్యంతర బడ్జెట్-2019లో ఈ 2 కొత్త పథకాలు హైలైట్ అయ్యాయి
Interim Budget 2019
Subhash Goud
|

Updated on: Jan 30, 2024 | 2:46 PM

Share

ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్‌ను మధ్యంతర బడ్జెట్‌గా పరిగణిస్తారు . ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశం ఉన్నందున పెద్ద పెద్ద పథకాలు తదితరాలను బడ్జెట్‌లో ప్రవేశపెట్టకూడదనే నిబంధన ఉంది. అయితే సాధారణ బడ్జెట్ లాగే ప్రభుత్వ ఆదాయ, వ్యయాల జాబితా మధ్యంతర బడ్జెట్ లో ఉంటుంది. చిన్న పన్ను మార్పులు, కొత్త పథకాలు మొదలైనవి ఉండవచ్చు. ఫిబ్రవరి 1, 2019న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇతర కారణాల వల్ల లేకపోవడంతో పీయూష్ గోయల్ ఆ రోజు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తన బడ్జెట్‌లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, పీఎం శ్రమ యోగి మంధన్ యోజనలను ప్రవేశపెట్టారు.

పీఎం కిసాన్ పథకం:

5 ఎకరాలు, అంతకన్న తక్కువ భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం వ్యవసాయ సహాయంగా సంవత్సరానికి రూ.6,000 అందిస్తుంది. ఒక్కో ఏడాదికి రూ.2000 చొప్పున మూడు సమాన వాయిదాలు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తోందని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో ప్రకటించారు. ఇప్పుడు ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు కూడా పీఎం కిసాన్ స్కీమ్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి శ్రమ యోగి మండన్ యోజన

ఇది అసంఘటిత రంగ కార్మికులు, కార్మికుల కోసం రూపొందించిన పథకం. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3వేలు పింఛను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్కీమ్‌కు సైన్ అప్ చేసే సభ్యులు క్రమం తప్పకుండా నెలకు రూ.55 నుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య, నెలవారీ ఆదాయం రూ. 15,000 కంటే తక్కువ ఉన్న వ్యక్తులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

2019 బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు ఏమిటి?

రూ. ఐదు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న గ్రూపునకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వబడింది. వేతన వర్గానికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ సౌకర్యం కల్పించబడింది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం తన కొత్త పథకాల ద్వారా రైతులకు, కూలీలకు కొంత ఊరటనిచ్చింది. మరి ఈ మధ్యంతర బడ్జెట్ లో కొత్త ప్రాజెక్టులు వస్తాయో లేదో వేచి చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి