Budget 2024: ఈ బడ్జెట్‌లో నిర్మలాసీతారామన్ ఈ రంగాలకు పెద్దపీట వేయనున్నారా?
నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 1న తన చివరి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదనలు చేస్తారని సాధారణ ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఇది మోడీ ప్రభుత్వానికి మధ్యంతర బడ్జెట్. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల..

పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వారి వంటగది బడ్జెట్ మోతమోగుతోంది. తిండి గింజలు, గ్యాస్, నూనె, పేస్ట్, సబ్బు ఇలా అన్నీ ఖరీదయ్యాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023 ఫిబ్రవరి 1న తన చివరి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రతిపాదనలు చేస్తారని సాధారణ ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఇది మోడీ ప్రభుత్వానికి మధ్యంతర బడ్జెట్. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌లో అన్ని వర్గాల వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
- సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 1న సమర్పించే బడ్జెట్ మధ్యంతర బడ్జెట్‌గా ఉంటుంది.
- ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న బడ్జెట్ కావడంతో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
- ఈ బడ్జెట్‌లో దేశంలోని చిన్న వ్యాపారుల కోసం ఏదైనా పెన్షన్ స్కీమ్ వంటివి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
- ద్రవ్యోల్బణంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందువల్ల, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే దిశగా బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేయొచ్చు.
- బడ్జెట్‌లో ఆటో పరిశ్రమకు ప్రోత్సాహం లభించవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ అమ్మకాలను పెంచే దిశగా ప్రత్యేక రాయితీలు ప్రకటించే అవకాశముంది.
- ఈసారి బడ్జెట్లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిధిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశముంది.
- 2016లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చివరి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2017 నుంచి వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్‌ను విడివిడిగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి పలికారు. రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు.
- అత్యధికంగా రైల్వే మంత్రిత్వ శాఖకు రూ.2.40 లక్షల కోట్ల వ్యయ కేటాయింపులు చేశారు. ఇందులో మూలధన వ్యయం: రూ.2.01 లక్షల కోట్లు, రెవెన్యూ వ్యయం: రూ.39,000 కోట్లు, సబ్సిడీలు: రూ.1,500 కోట్లు ఉంది.
- తొలి బడ్జెట్ 1947 నవంబరు 26న నాటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.
- కేంద్ర బడ్జెట్‌ను అత్యధికంగా 10సార్లు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు. 1962 నుంచి 69 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా 10సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. పి.చిదంబరం 9సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
- నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఐదుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024 ఫిబ్రవరి 1న ఆరోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
- 2016 వరకు కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినం రోజు సమర్పించే సాంప్రదాయం ఉండేది. 2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ఫిబ్రవరి 1 తేదీకి మార్చారు. అప్పటి నుంచి ప్రతి యేటా ఆ తేదీన బడ్జెట్ సమర్పిస్తున్నారు.
- ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 2019లో నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌నుప్రవేశపెట్టి ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి




