AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bazaar: రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు.. టమాటా నుంచి వెల్లుల్లి వరకు రేట్లు ఇవే!

Hyderabad Rythu Bazaar Vegetable Prices: కూకట్‌పల్లి రైతు బజార్‌లో రోజువారీ వంటల్లో ఉపయోగించే టమాటా, వంకాయ, బెండకాయ, బంగాళాదుంప వంటి కూరగాయలతో పాటు వివిధ రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. అలాగే కూరగాయలతో పాటు వంటల్లో ఉపయోగించే ఇతర ఉత్పత్తుల ధరలను..

Rythu Bazaar: రైతు బజార్‌లో నేటి కూరగాయల ధరలు.. టమాటా నుంచి వెల్లుల్లి వరకు రేట్లు ఇవే!
Kukatpally Rythu Bazaar
Subhash Goud
|

Updated on: Oct 23, 2026 | 1:37 PM

Share

Hyderabad Rythu Bazaar Vegetable Prices: నగరంలోని కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లో కూరగాయల ధరల వివరాలు విడుదలయ్యాయి. 2026 అక్టోబర్ 23వ తేదీకి సంబంధించిన ధరల జాబితా ప్రకారం టమాటా కిలో రూ.27, బంగాళాదుంప రూ.19, ఉల్లిగడ్డ రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు వెల్లుల్లి, ఎండుమిర్చి, పాత అల్లం ధరలు ఎక్కువగా ఉన్నాయి. రైతు బజార్‌కు వెళ్లి కూరగాయలు కొనాలనుకునేవారు తాజా ధరల జాబితాను ఓసారి పరిశీలించండి.

కూకట్‌పల్లి రైతు బజార్‌లో రోజువారీ వంటల్లో ఉపయోగించే టమాటా, వంకాయ, బెండకాయ, బంగాళాదుంప వంటి కూరగాయలతో పాటు వివిధ రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

కూరగాయ పేరు ధర
టమాటా రూ.27
వంకాయ రూ.18
బెండకాయ రూ.33
పచ్చిమిర్చి రూ.60
బజ్జి మిర్చి రూ.55
కాకరకాయ రూ.32
బీరకాయ రూ.22
క్యాబేజీ రూ.12
చిక్కుడుకాయ రూ.55
క్యారెట్ రూ.50
కాలీఫ్లవర్ రూ.25
దొండకాయ రూ.22
ఫీల్డ్ బీన్స్ రూ.55
గోరుచిక్కుడు రూ.35
బీట్‌రూట్ రూ.33
క్యాప్సికం రూ.50
బంగాళాదుంప రూ.19
లోకల్ కీరదోస రూ.18
ఇటాలియన్ కీరదోస రూ.32
దోసకాయ రూ.35
సొరకాయ రూ.20
పొట్లకాయ రూ.24
కందగడ్డ రూ.35
ఉల్లిపొరక రూ.55
ఉల్లిగడ్డ రూ.40

ఇతర కూరగాయలు, పండ్ల ధరలు:

రైతు బజార్‌లో అరటికాయలు, పచ్చిమామిడికాయలు, చామగడ్డ, చిలగడదుంప, గుమ్మడికాయ, బొప్పాయి వంటి ఇతర ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు ఇలా ఉన్నాయి.

కూరగాయ / ఉత్పత్తి ధర
పచ్చి అరటికాయ ఒక్కటి రూ.10–11
చామగడ్డ కిలో రూ.41
ముల్లంగి ఒక్కటి రూ.6–8
చిలగడదుంప కిలో రూ.40
గుమ్మడికాయ కిలో రూ.40
నిమ్మకాయలు డజను రూ.50–60
మునగకాయ ఒక్కటి రూ.8–10
బొప్పాయి కిలో రూ.50
పుట్టగొడుగులు 200 గ్రాములు రూ.45
పచ్చి మామిడికాయ ఒక్కటి రూ.15–20

వెల్లుల్లి, అల్లం ధరలు ఎంతంటే?

కూరగాయలతో పాటు వంటల్లో ఉపయోగించే ఇతర ఉత్పత్తుల ధరలను పరిశీలిస్తే కొన్ని వస్తువులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా వెల్లుల్లి కిలో రూ.260, ఎండుమిర్చి రూ.280గా ఉన్నాయి. పాత అల్లంతో పోలిస్తే కొత్త అల్లం ధర తక్కువగా ఉంది.

 పేరు ధర
ఎండుమిర్చి కిలో రూ.280
పాత అల్లం కిలో రూ.180
కొత్త అల్లం కిలో రూ.120
వెల్లుల్లి కిలో రూ.260
చింతపండు కిలో రూ.160
పండుమిర్చి కిలో రూ.80
ఉసిరికాయ కిలో రూ.80
కరివేపాకు కిలో రూ.60
పర్వల్ కిలో రూ.50
వేరుశనగ కాయలు కిలో రూ.60
లోబా కిలో రూ.40
టీసెల్ గోర్డ్ కిలో రూ.100

ఇది కూడా చదవండి: BSNL Bharat Fiber: రూ.549కే 4000GB డేటా.. హైస్పీడ్‌ ఫైబర్‌ ఇంటర్నెట్‌.. 25కుపైగా OTTలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us