Komaki Electric Scooter: కిర్రాక్ స్కూటర్‌ని లాంచ్ చేసిన కొమాకి.. సింగిల్ చార్జ్‌పై ఏకంగా 180కి.మీ..
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ కొమాకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇప్పటికే ఉన్న కొమాకి టీఎన్95 స్పోర్ట్ స్కూటర్‌కు అత్యాధునిక సాంకేతికతను జోడించింది. అదిరిపోయే ఫీచర్లతో అప్‌డేట్ చేసి విడుదల చేసింది.

విద్యుత్ స్కూటర్ల వినియోగం పెరుగుతోంది. ఆటో రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలు తమ ముద్ర వేసుకుంటున్నాయి. నెమ్మదిగా ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీ కొమాకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇప్పటికే ఉన్న కొమాకి టీఎన్95 స్పోర్ట్ స్కూటర్‌కు అత్యాధునిక సాంకేతికతను జోడించింది. అదిరిపోయే ఫీచర్లతో అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ప్రధానంగా ఈ కొమాకి ఈవీ స్కూటర్ లో యాంటీ స్కిడ్ టెక్నాలజీ, లిథియం ఐరన్ ఫాస్పేట్ యాప్ ఆధారిత స్మార్ట్ బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్పెసిఫికేషన్లు ఇవి..
5kW హబ్ మోటార్ ద్వారా పవర్ అందిస్తుంది. 50amp కంట్రోలర్‌ను ఉపయోగిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ 3 గేర్ మోడ్‌లను కలిగి ఉంది. ఎకో, స్పోర్ట్స్, టర్బో రీజెన్‌లతో వస్తుంది. ఈ బైకు మోడల్ యాంటీ-స్కిడ్ టెక్నాలజీతో వస్తుంది. మంచి గ్రిప్ తో డ్రైవింగ్ చేసేందుకు అనుమతిస్తుంది. అలాగే యాప్-ఆధారిత స్మార్ట్ బ్యాటరీలు ఇందులో ఉన్నాయి. ఈ బ్యాటరీలు ఫైర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటాయి. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది.
ఫీచర్లు ఇవి..
ఈ స్కూటర్ డ్యూయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ కంట్రోల్ కొత్త కీ ఫోబ్‌ను అందిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 85కిమీ వేగంతో దూసుకెళ్తుంది. ఇందులో 18-లీటర్ బూట్ కూడా ఉంది. అలాగే డ్యూయల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ఎల్‌ఈడీ ఫ్రంట్ వింకర్‌లు, టీఎఫ్‌టీ స్క్రీన్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, సౌండ్ సిస్టమ్, బ్లూటూత్, ఆన్-రైడ్ కాలింగ్, పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.



ధర, లభ్యత, రేంజ్..
కొమాకి స్కూటర్ మెటల్ గ్రే, చెర్రీ రెడ్ వంటి కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది.రెండు వేరియంట్లలో లభిస్తోంది. బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 150 కిలోమీటర్లు ఇచ్చే వేరియంట్ ధర రూ. 1,31,035 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అలాగే బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 180 కిలోమీటర్లు రేంజ్ ఇచ్చే అడ్వాన్స్‌డ్ మోడల్ ధర రూ. 1,39,871కే లభిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..