KIA Motors: భారత వాహన ప్రియులకు కియా మోటార్స్ కంపెనీ భారీ షాక్.. ఏమిటంటే..

KIA Motors: సౌత్ కొరియాకు ఆటో దిగ్గజం Hyundai Motor Groupకు చెందిన కియా మోటార్స్ భారత వాహన రంగంలో అనతి కాలంలోనే మంచి ఆదరణను పొందింది. భారత ఆటోమొబైల్‌ మార్కెట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ నమ్మకమైన ఆటోమొబైల్‌ కంపెనీగా గుర్తింపు దక్కించుకుంది. కానీ.

KIA Motors: భారత వాహన ప్రియులకు కియా మోటార్స్ కంపెనీ భారీ షాక్.. ఏమిటంటే..
Kia Motors
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 05, 2022 | 7:01 PM

KIA Motors: సౌత్ కొరియాకు ఆటో దిగ్గజం Hyundai Motor Groupకు చెందిన కియా మోటార్స్ భారత వాహన రంగంలో అనతి కాలంలోనే మంచి ఆదరణను పొందింది. భారత ఆటోమొబైల్‌ మార్కెట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ నమ్మకమైన ఆటోమొబైల్‌ కంపెనీగా గుర్తింపు దక్కించుకుంది. కానీ.. కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయం వాహన కొనుగోలు దారులకు ఊహించని షాక్(Big Blow) గా నిలిచింది. అదేంటంటే కార్ల వివిధ మోడళ్ల రేట్లను కియా ఇండియా పెంచాలని నిర్ణయించటం.. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు పెంపు బాటపడతాయని సూచిస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి కూడా. ఇదే మార్గంలో.. ఇప్పుడు కియా ఇండియా కూడా పలు కార్ల ధరలను పెంచింది. ఈ ధరల పెంపు ఏప్రిల్‌ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత మార్కెట్లలోకి సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌, కారెన్స్‌ వంటి కార్లను కియా ఇండియా ప్రవేశపెట్టింది. ధరల పెంపుతో కియా కారెన్స్‌, కియా సెల్టోస్‌, సోనెట్‌, కార్నివాల్‌ ధరలు ఇప్పుడు భారీగా పెరగనున్నాయి.

పెరిగిన ధరల వివరాలు..

  1. భారత మార్కెట్లలోకి కియా కారెన్స్‌ MPV వాహనాన్ని సంస్థ లాంచ్‌ చేసింది. కియా కారెన్స్‌ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి  ధరలను రూ.70,000 వరకు కియా ఇండియా పెంచింది. ఆయా ట్రిమ్స్‌ మోడల్స్‌ను బట్టి ధరలు మారే అవకాశం ఉంది.  మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌ కలిగిన ప్రీమియం 7-సీటర్ కియా కారెన్స్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కలిగిన లగ్జరీ+ 7-సీటర్ ధరలు రూ. 40,000,  రూ. 70,000 వరకు పెరిగింది.
  2.  కియా సెల్టోస్ ధర రూ. 10,000 నుంచి రూ. 36,000 వరకు పెరిగాయి. కియా సెల్టోస్ GTX+ 1.4 మాన్యువల్ ధర రూ. 10,000 పెరిగింది. సెల్టోస్‌ HTX+ 1.5 మాన్యువల్, iMT ట్రిమ్స్‌ ధరలు  రూ. 36,000 మేర పెరిగాయి. కియా సెల్టోస్ డీజిల్ మోడల్స్‌ ధరలు రూ. 20,000 నుంచి రూ. 34,000 వరకు పెరగనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
  3. కియా సోనెట్ పెట్రోల్, డీజిల్ మోడళ్ల ధరలు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు పెరిగాయి. పెట్రోల్‌ సోనెట్ HTX 1.0 మోడల్‌ ధర రూ. 30,000 వరకు పెరిగింది. కియా సోనెట్‌  HTX 1.5 డీజిల్ వెర్షన్ ఇప్పుడు GTX 1.5 మాన్యువల్ వెర్షన్ కంటే రూ. 30,000 ఖరీదైనదిగా మారింది.
  4. కియా కార్నివాల్ ధరలను రూ. 50,000 పెంచుతూ  కియా నిర్ణయం తీసుకుంది. 6 సీట్ల ప్రిస్టీజ్ ఆటోమేటిక్ ధర రూ.29.49 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు ఈ కారు విలువ పెరిగి రూ.29.99 లక్షలకు లభించనుంది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Elon Musk Edit Button Poll: మస్క్ పోల్ పై ట్విట్టర్ సీఈవో స్పందన.. ఆలోచించి ఓటేయాలని సూచన.. ఎందుకంటే..

Multibagger Stock: ఏడాదిలో మదుపరులను కోటీశ్వరులు చేసిన స్టాక్.. ఇంకా ఆగని షేర్ జోరు..