AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bitcoin ATM: బిట్ కాయిన్ ఏటీఎం నిర్వాహకులకు బిగ్ రిలీఫ్.. కేసును కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

bitcoin atm: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు లేనప్పటికీ, బెంగళూరులోని మాల్‌లో రెండేళ్ల క్రితం క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు.

Bitcoin ATM: బిట్ కాయిన్ ఏటీఎం నిర్వాహకులకు బిగ్ రిలీఫ్.. కేసును కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
bitcoin atm
Sanjay Kasula
|

Updated on: Feb 19, 2021 | 8:10 PM

Share

Bitcoin ATM in Bengaluru: బిట్ కాయిన్ ఏటీఎం నిర్వాహకులకు బిగ్ రిలీఫ్ లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలు లేనప్పటికీ, బెంగళూరులోని మాల్‌లో రెండేళ్ల క్రితం క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. దీనిని క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ యూనికాయిన్ కోఫౌండర్లు ఇద్దరు కలిసి ఏర్పాటు చేశారు.

అవసరమైన కనీస అనుమతులు లేకుండా దీనిని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. దీంతో కంపెనీపై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా కంపెనీకి కోర్టు నుండి ఊరట లభించింది. ఈ బిట్ కాయిన్ ఏటీఎం ఏర్పాటు చేసిన ఇద్దరికి ఇది పెద్ద ఊరట లభించింది. సుప్రీం కోర్టు నిర్ణయం నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీస్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.

బిట్ కాయిన్ అనగానే మనకు గుర్తుకు వచ్చేంది డిజిటల్ కరెన్సీ.. అయితే ఈ ఏటీఎం ఎక్కడ ఉంది.. ఏంటి అసలు సంగతి ఓ సారి చూద్దాం.. 2018 Oct 18న ఈ ఏటీఎంను ప్రారంభించారు. యూనికాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దేశ సిలికాన్ సిటీ బెంగుళూరులో దేశంలోనే మొట్టమొదటి బిట్ కాయిన్ ఏటీఎం ప్రారంభించింది.

ఎక్కడ ఉంది..

ఈ బిట్ కాయిన్ ఏటీఎంని బెంగుళూరు పాత విమానాశ్రయం దగ్గర ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం మెషీన్ ట్రేడింగ్, ఎక్స్చేంజీ ప్లాట్ ఫామ్ మాదిరిగా పని చేస్తుంది. ముందుగా ఇది కస్టమర్ ని గుర్తించే ప్రక్రియ చేపడుతుంది.

ఎలా పని చేస్తుంది..

కస్టమర్ ముందుగా బెంగుళూరు పాత విమానాశ్రయం సమీపంలోని కెమ్ ఫార్ట్ మాల్ లో ఉన్న యూనికాన్ కార్యాలయంలో రిజిస్టర్ కావాలి. కస్టమర్లు తమ దగ్గరున్న విలువను అనుసరించి బిట్ కాయిన్లను కొనుగోలు చేయవచ్చు..అమ్మవచ్చని యూనికాన్ తెలిపింది.

కస్టమర్లు ఏం చేయాలి..

వినియోగదారులు ముందుగా తమ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మొబైల్ కి పాస్ వర్డ్ వస్తుంది. ఆ తర్వాత తమ పాన్ నంబర్, ఫోన్ నెంబర్, అడ్రస్, బ్యాంక్ వివరాలతో తమ గుర్తింపు ధృవీకరించాలి. డబ్బు జమ చేయడానికి, తీసుకొనేందుకు మొబైల్ కి వచ్చే 12 అంకెల ఓటీపీని ఇవ్వాలి. ఇలా ఈ ఏటీఎం పని చేస్తుంది. అయితే ఈ బిట్ కాయిన్‌ ఏటీఎంపై కేసులు పెట్టడంతో దీని పనితీరు ఒక్కాసారిగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు దేశంలో క్రిప్టో కరెన్సీపై భారీగా పెట్టబడులు పెడుతున్న సమయంలో ఈ ఏటీఎంపై ఉన్న చిక్కుముడి వీడటంతో నిర్వాహకులకు పెద్ద ఊరటనిచ్చింది.

ఇవి కూడా చదవండి..

CA Exam Date 2021: సీఏ పరీక్ష రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. Bitcoin value jumps: ఎక్కడికీ ఈ పరుగు.. రోజు రోజుకు బిట్ కాయిన్ సరికొత్త కొత్త రికార్డులు.. GMC polls: కౌన్‌ బనేగా గుంటూర్‌ మేయర్‌? పదేళ్ల తర్వాత జరుగుతున్న పోరుపై హైటెన్షన్