Jio Financial Services: సొంతింటి కలను నిజం చేయనున్న జియో.. గృహ రుణాల విషయంలో కీలక ప్రకటన
భారతదేశంలో జియో అంటే తెలియని వారు లేరు. టెలికం రంగంలో జియో సృష్టించిన విప్లవం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 5 జీ సర్వీసుల ద్వారా వినియోగదారుల ఆదరణ పొందుతుంది. అయితే జియో టెలికం రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో తన హవా చూపించాలాని కోరుకుంటుంది. తాజాగా జియోకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో వినియోగదారులకు గృహ రుణాలను అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) జియో ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా కీలక ప్రకటన చేసింది.
భారతదేశంలో జియో అంటే తెలియని వారు లేరు. టెలికం రంగంలో జియో సృష్టించిన విప్లవం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం 5 జీ సర్వీసుల ద్వారా వినియోగదారుల ఆదరణ పొందుతుంది. అయితే జియో టెలికం రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో తన హవా చూపించాలాని కోరుకుంటుంది. తాజాగా జియోకు చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో వినియోగదారులకు గృహ రుణాలను అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బిఎఫ్‌సి) జియో ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా కీలక ప్రకటన చేసింది. జియో ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ బీటా ట్రయల్‌గా ప్రారంభించిన హోమ్ లోన్ సేవలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని పేర్కొంది. అలాగే ప్రాపర్టీ లోన్స్, సెక్యూరిటీ బేస్‌డ్ లోన్స్ వంటి వాటి ద్వారా సేవలను విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే గృహ రుణాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గత వారం జియో కంపెనీ వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా జియో ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హితేష్ సేథియా మాట్లాడుతూ త్వరలోనే వినియోగదారులకు గృహ రుణాలను అందిస్తామని స్పష్టం చేశారు. జియో ఫైనాన్స్ లిమిటెడ్ ఇప్పటికే మార్కెట్‌లో సురక్షిత రుణ ఉత్పత్తులను ప్రవేశపెట్టిందని, ఇందులో సప్లై చైన్ ఫైనాన్సింగ్ కోసం ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలు, ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్‌లు ఉన్నాయని వివరించారు. ఏప్రిల్ 2024లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు రూ. 394.70కి చేరుకున్నాయి. అంటే దాదాపు ఈ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికు చేరుకున్నాయి. అయితే స్టాక్ 2023 అక్టోబర్‌లో రూ. 204.65కి పడిపోయాయి.
ఇటీవల జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (సీఐసీ)గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి ఆమోదం పొందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడిగా జాబితా చేసిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ పెట్టుబడి, ఫైనాన్సింగ్, బీమా బ్రోకింగ్, పేమెంట్ బ్యాంకింగ్, పేమెంట్ ప్లాట్‌ఫారమ్ సేవలను అందించనుంది. జూన్ త్రైమాసికంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభంలో 6 శాతం క్షీణత నమోదైంది. అంటే దాదాపు రూ. 313 కోట్లు నష్టపోయింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.332 కోట్ల లాభాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి