Fixed Deposit: ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెరిగే అవకాశం! కొత్త ఖాతా ఓపెన్ చేయాలనుకునే వారికి నిపుణులు ఏం చెబుతున్నారంటే..

రెపో రేటు పెరిగినప్పుడల్లా బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మాత్రం వెంటనే పెంచవు. కాస్త సమయాన్ని తీసుకుంటాయి.

Fixed Deposit: ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెరిగే అవకాశం! కొత్త ఖాతా ఓపెన్ చేయాలనుకునే వారికి నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Fixed Deposits
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2023 | 1:49 PM

మీరు ఫిక్స్ డ్ డిపాజిట్(ఎఫ్డీ) చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? కొత్త సంవత్సరం సురక్షిత పొదుపు పథకమైన ఎఫ్డీ ఖాతా తెరవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో మరికొన్ని రోజుల్లో ఎఫ్డీలపై వడ్డీ రేట్లను బ్యాంకులు పెంచనున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కొత్తగా ఎఫ్డీ తెరవాలి అనుకునే వారు కొద్ది రోజులు ఆగితే మంచిదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆర్బీఐ రెపో రేటుకి, ఎఫ్డీ వడ్డీ రేట్లకు సంబంధం ఏమిటి? ఇప్పుడు ఎఫ్డీ ఖాతా తెరవడం మంచిదా.. లేక కొన్ని రోజు ఆగడం ఉత్తమమా? ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయాలు మీ కోసం..

ఆర్బీఐ చేతుల్లోనే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేటును పెంచుకుంటూ పోతోంది. ఇటీవల మళ్లీ 35 బేస్ పాయింట్లను పెంచింది. ప్రస్తుతం రెపో రేటు 6.25శాతంగా ఉంది. అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఆర్బీఐ రెపో రేటును పెంచుతోంది. ఇలా గతేడాది మే నుంచి ఇప్పటి వరకూ 225 బేస్ పాయింట్లు పెంచింది. ఈ రెపో రేటు ఆధారంగానే బ్యాంకులు రిటైల్ పెట్టుబడిదారులకు అందించే రుణాలు, డిపాజిట్ రేట్లు నిర్ణయిస్తాయి. ఇప్పటి వరకూ ఆర్బీఐ రెపో రేటును ఐదు సార్లు పెంచింది. దీని కారణంగా అన్ని బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఈ కొత్త ఏడాదిలో కూడా ఆర్బీఐ రెపో రేటు మళ్లీ పెంచబోతోందన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకునే వారిలో మీమాంస ఉంది. ఇప్పుడు ఖాతా ప్రారంభించాలా? లేక కొన్నాళ్లు ఆగాలా అని?

నిపుణులు ఏం చెబుతున్నారంటే..

దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారంటే.. రెపో రేటు పెరిగినప్పుడల్లా బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. అయితే ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మాత్రం వెంటనే పెంచవు. కాస్త సమయాన్ని తీసుకుంటాయి. తమ వద్ద ఉన్న లిక్విడిటీ బట్టి బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. అయితే కొద్ది రోజుల్లోనే రెపో రేటు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫిక్స్ డ్ డిపాజిట్లపైనా వడ్డీ పెంచే యోచనను పూర్తిగా తోసివేయలేమని నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఎఫ్ డీ వడ్డీ రేట్లు 8.5 శాతం నుంచి 9 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఎఫ్డీ ఖాతా తెరవాలి అనుకునే వారు కొద్ది రోజులు ఆగితేనే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఇప్పటికే ఉన్న ఎఫ్డీలను కూడా రద్దు చేసుకొని మళ్లీ కొత్త ఖాతాలను తెరవడం కూడా మంచి ఆప్షనే అని చెబుతున్నారు. అదే విధంగా చిన్న చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎఫ్డీలపై అధిక వడ్డీని అందిస్తాయి. అయితే వాటిల్లో పెట్టుబడులు అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా డిఫాల్ట్ అయినప్పుడు బీమా కేవలం రూ. 5లక్షలు వరకూ ఉండే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!